ఆన్‌లైన్ వ్యాపారంతో లాభాలు పొందొవచ్చని ఆశ చూపి.. ఓ మహిళ లక్షల్లో నగదు కాజేసి అక్కడి నుంచి ఉడాయించింది. చివరకు మోసపోయామని గ్రహించిన బాధితులు పోలీసులను ఆశ్రయించారు. ఆంధ్రప్రదేశ్‌లోని పాత గుంటూరుకు చెందిన ప్రియ, శారదకు చిట్టీల దగ్గర నీలిమ అనే మహిళ పరిచయమైంది. తాను ఏ-వన్ కంపెనీలో పనిచేస్తున్నాని.. తనకు ఆన్‌లైన్‌లో తక్కువ ధరకే ఎలక్ట్రానిక్ వస్తువులు వస్తాయని నమ్మించింది.
నీలిమ మాటలు నమ్మిన ప్రియ, ధనలక్ష్మి వేర్వేరుగా 20 లక్షలు ఇచ్చారు. రోజులు గడుస్తున్నా.. వస్తువులు రాకపోవడంతో నీలిమను నిలదీశారు. వారంలోగా వస్తాయని చెప్పి అక్కడి నుంచి పరారైంది. మోసపోయామని గ్రహించిన బాధితులు.. గుంటూరు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. వ్యాపారం కోసం మరికొందరిని చేర్చుకున్నామని.. ఇప్పుడు వాళ్ళొచ్చి వచ్చి గొడవ చేస్తున్నారని కన్నీటి పర్యంతమయ్యారు. తమకు న్యాయం చేయాలని బాధితులు మొరపెట్టుకుంటున్నారు.
ఇవీ చూడండి : బోధన్ పాస్‌పోర్ట్‌ల కేసులో మరో ఇద్దరు అరెస్టు