ETV Bharat / crime

అదృశ్యమైన ఇద్దరు బాలికల ఆచూకీ లభ్యం... అసలేమైందంటే? - అదృశ్యమైన బాలికల ఆచూకీ లభ్యం

Missing students found alive: మేడ్చల్ జిల్లాలో అదృశ్యమైన ఇద్దరు బాలికల ఆచూకీ లభ్యమైంది. పాఠశాలకి వెళ్లిన వారు సాయంత్రం అయినా ఇంటికి రాకపోగా కిలోమీటర్ దూరంలో ఉన్న చెరువు వద్ద తాము చనిపోతున్నామని లెటర్లు పెట్టి తల్లిదండ్రులను, పోలీసులను ఆందోళనకు గురిచేశారు. ఇవాళ పిల్లలు క్షేమంగా తిరిగిరావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. వారు రాత్రంతా ఎటు వెళ్లారు... ఏమైనా ప్రేమ వ్యవహారం ఉందా ! అనే కోణంలోను దుండిగల్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Missing students found alive
అదృశ్యమైన బాలికల ఆచూకీ లభ్యం
author img

By

Published : Mar 6, 2022, 11:49 AM IST

Missing students found alive: పాఠశాలకు వెళ్తున్నామని చెప్పి మేడ్చల్ జిల్లాలో అదృశ్యమైన ఇద్దరు బాలికల ఆచూకీ లభ్యమైంది. శనివారం సాయంత్రం పోలీసులు సీసీటీవీ ఫుటేజీలు పరిశీలించగా బహదూర్‌పల్లి, దూలపల్లి వైపు వెళ్లినట్లు గుర్తించారు. ముమ్మరంగా గాలిస్తున్న క్రమంలో నేడు(ఆదివారం) బాలికలే నేరుగా ఇంటికి ఇచ్చారు. పిల్లలు క్షేమంగా తిరిగిరావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

ఏం జరిగింది?

మేడ్చల్ జిల్లా సూరారం కాలనీకి చెందిన గాయత్రి(15), మౌనిక(15) స్థానిక ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి చదువుతున్నారు. రోజూ లాగే శనివారం పాఠశాలకు వెళ్లిన విద్యార్థినీలు... సాయంత్రమైన ఇంటికి రాలేదు. పలుమార్లు అదనంగా ప్రైవేట్ క్లాసులు ఉన్నయంటూ ఆ బాలికలు ఒక గంట ఆలస్యంగా ఇంటికి వెళ్తుండేవారు. కానీ శనివారం మాత్రం రాత్రి 7 దాటినా ఇంటికి రాకపోవడంతో వారి పాఠశాల, పరిసర ప్రాంతాల్లో ఆచూకీ కోసం బాలికల తల్లిదండ్రులు వెతకడం ప్రారంభించారు.

ముమ్మర గాలింపు...

ఈ క్రమంలో సూరారం కట్టమైసమ్మ చెరువు వద్ద బాలికల స్కూల్ బ్యాగులతో పాటు తాము చనిపోతున్నామంటూ రాసిన లేఖలు లభ్యమవడంతో స్థానికులు దుండిగల్ పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న వారు విద్యార్థినీల బ్యాగులు, లేఖలు గమనించిన అనంతరం సీసీటీవీ ఫుటేజీలని పరిశీలించారు. వాటిల్లో బాలికలు చెరువు వద్ద బ్యాగులు ఉంచి అక్కడి నుంచి బహదూర్‌పల్లి, దూలపల్లి వైపు వెళ్లినట్లు సీసీటీవీ రికార్డ్స్‌లో గుర్తించారు. పోలీసులు బృందాలుగా ఏర్పడి గాలిస్తున్న సమయంలో ఆ విద్యార్థినీలు ఆదివారం ఉదయం ఇంటికి చేరుకున్నారు. వారు రాత్రంతా ఎటు వెళ్లారు... ఏమైనా ప్రేమ వ్యవహారం ఉందా ! అనే కోణంలోను దుండిగల్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి:స్పా సెంటర్లపై పోలీసుల దాడులు.. ఆరుగురు అమ్మాయిల రెస్క్యూ..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.