నిర్మల్ జిల్లా కేంద్రంలోని గాయత్రీపురానికి చెందిన కదం వంశీ(15) అనే విద్యార్థి శుక్రవారం తన మిత్రులతో కలిసి సిద్ధాపూర్ సమీపంలోని సరస్వతీ కాలువలో స్నానం చేసేందుకు వెళ్లాడు. నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటం వల్ల వంశీ గల్లంతయ్యాడు. భయాందోళన చెందిన మిత్రులు.. కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.
హుటాహుటిన అక్కడికి చేరుకున్న స్థానికులు వంశీ కోసం గాలించినా ఫలితం లేకుండా పోయింది. నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటం వల్ల అధికారులకు సమాచారం అందించి ప్రవాహాన్ని నిలిపివేశారు. కాలువ పరిసరాల్లో గాలింపు చర్యలు చేపట్టారు.
- ఇదీ చూడండి : ఇద్దరు పిల్లలతో కలిసి చెరువులో దూకిన తల్లి