మిషన్ భగీరథ నీటి వాల్వుకు ఏర్పాటు చేసిన రక్షక కవచాన్ని ఢీకొని ఇద్దరు యువకులు మృతి చెందిన ఘటన వరంగల్ అర్బన్ జిల్లా కమలాపూర్ మండలం ఉప్పల్ సమీపంలో చోటు చేసుకుంది. ఉప్పల్‌కు చెందిన పోతిరెడ్డి రాజు (26) తన బావమరిది కర్ర లిఖిత్ (17)తో కలిసి ద్విచక్ర వాహనంపై కమలాపూర్ వైపు వెళ్తున్నారు. మార్గమధ్యలో వాహనం అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న మిషన్ భగీరథ నీటి వాల్వుకు ఏర్పాటు చేసిన ఇనుప చువ్వల రక్షక్ష కవచాన్ని ఢీ కొట్టారు.
ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. ఘటనా స్థలికి ఎస్సై విజయ్‌కుమార్ చేరుకొని మృతదేహాలను శవ పరీక్షల నిమిత్తం వరంగల్ ఎంజీఎంకు తరలించారు. లిఖిత్ స్వగ్రామం ఐనవోలు మండలం కానిపర్తికి చెందినట్లుగా తెలిసింది.
ఇదీ చూడండి: 'మైనర్ బాలిక లైంగిక దాడి కేసును పర్యవేక్షించండి'