Huts demolition in Warangal: వరంగల్ జిల్లా బొల్లికుంటలో ప్రభుత్వ స్థలంలో వేసుకున్న గుడిసెల తొలగింపు తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. సీపీఐ అధ్వర్యంలో ఆరు నెలల క్రితం గూడు వేసుకున్నారు. ఇప్పుడు అధికారులు అక్రమంగా తమ గుడిసెలు తొలగించారంటూ వరంగల్ ఖమ్మం జాతీయ రహాదారిపై బాధితులు ధర్నా చేపట్టారు. దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.
అంతకుముందు అధికారులు పెద్దఎత్తున పోలీసులను మోహరించి జేసీబీలతో గుడిసెల తొలగింపును పూర్తి చేశారు. అనంతరం వాటికి నిప్పంటించారు. పేదలు సీపీఐ ఆధ్వర్యంలో ఆరు నెలలక్రితం సర్వే నెంబర్ 476, 484 లో గుడిసెలు వేసుకున్నారు. ఇప్పుడు అధికారులు వాటిని తొలగించడంతో నిలువ నీడ లేక బిక్కుబిక్కుమంటున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి తమకు రెండుపడకల గదులు కేటాయించి ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. నిలువ నీడ లేక తమ బతుకులు రోడ్డున పడ్డాయని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.
'6 నెలలుగా ఇక్కడే జీవిస్తున్నాం. ఎలాంటి సమాచారం ఇవ్వకుండా రాత్రికి రాత్రే పెట్రోల్ పోసి తగలపెట్టారు. అడ్డుకున్న వారిని ఆడవాళ్లు అని కూడా చూడకుండా డీసీఎంలలో ఎక్కించి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు. ప్రభుత్వ భూమి అని తెలిసే 6 నెలల క్రితం సీపీఐ అధ్వర్యంలో గుడిసెలు వేసుకున్నాం. ఇప్పుడు ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా గుడిసెలను కూల్చి వేయడం అన్యాయం. కనీసం ఇంట్లోని సామాన్లు తరలించుకునేందుకు కూడా సమయం ఇవ్వరా..? రాత్రికి రాత్రే తొలగించారు. నిలువ నీడ లేక ఇప్పుడు రోడ్డున పడ్డాం'-బాధితులు
ఇవీ చదవండి: