హైదరాబాద్ కూకట్‌పల్లి వివేకానందనగర్‌లో వ్యాపారి దామోదర్ ఇంట్లో జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేదించారు. నిందితులు ముగ్గురినీ అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.28.90 లక్షల నగదు, రూ.71.10 లక్షల విలువైన బంగారం స్వాధీనం చేసుకున్నట్లు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర వెల్లడించారు. చోరీ చేసిన అనంతరం నిందితులు బంగారం, ఇతర ఆభరణాలను హైదరాబాద్‌లో దాచి.. బెంగళూరు పారిపోయినట్లు తెలిపారు. తిరిగి బంగారం తీసుకునేందుకు నగరానికి రాగా.. పట్టుకున్నట్లు వివరించారు.
పథకం ప్రకారమే నేపాలీ ముఠా యజమాని ఇంట్లో చోరీకి పాల్పడిందని సీపీ పేర్కొన్నారు. ఈ ముఠా ధనవంతుల ఇళ్లలో కాపలాదారులుగా, పని మనుషులుగా చేరి వారిని నమ్మించి.. అనంతరం ఈ తరహా చోరీలకు తెగబడుతోందని ఆయన వివరించారు. నేపాల్ నుంచి ఈ తరహా ముఠాలు దేశంలోని మెట్రో నగరాల్లోకి చొరబడి దొంగతనాలు చేస్తున్నాయని స్పష్టం చేశారు. ఇలాంటి వారిని పనిలో పెట్టుకునే ముందు జాగ్రత్త వహించాలని సూచించారు.
కూకట్‌పల్లి వివేకానందనగర్‌లో చోరీ కేసులో నేపాలీ దంపతులతో పాటు మరో వ్యక్తిని అరెస్టు చేశాం. దామోదర్ ఇంట్లో పని చేసిన నేపాలీ దంపతులే చోరీ చేసినట్లు నిర్ధరణ అయింది. నిందితుల నుంచి రూ.28.90 లక్షలు, రూ.71.10 లక్షల విలువైన బంగారం స్వాధీనం చేసుకున్నాం. చోరీ తర్వాత నిందితులు బెంగళూరు పారిపోయారు. బంగారాన్ని హైదరాబాద్‌లో దాచిపెట్టి బెంగళూరుకు వెళ్లిపోయారు. బంగారం తీసుకునేందుకు మళ్లీ హైదరాబాద్‌కు రాగా.. అరెస్ట్ చేశాం.-స్టీఫెన్ రవీంద్ర, సైబరాబాద్ సీపీ
ఇవీ చూడండి..
ఫంక్షన్కు వెళ్లొచ్చే సరికి ఇల్లు గుల్ల.. కాపలాదారే కన్నం వేశాడు..