నాగర్ కర్నూల్ జిల్లా పెంట్లవెల్లి మండలం జటప్రోలులో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. విద్యుత్ వైర్లు వేలాడి ఉండటంతో పశుగ్రాసం తీసుకొని వెళుతున్న ట్రాక్టర్కు తీగలు తగిలి గడ్డితో పాటు వాహనం సైతం మంటల్లో కాలిపోయింది. పెద్ద దగడ గ్రామానికి చెందిన బాలకృష్ణారెడ్డి.. గోపాలపురంలోని ఓ రైతు వద్ద పశువులకు గడ్డి కొనుగోలు చేసి ట్రాక్టర్లో నింపుకున్నాడు. స్వగ్రామానికి తిరిగి వెళ్తుండగా జటప్రోలు గ్రామపంచాయతీ కార్యాలయం వద్దకు రాగానే కరెంటు వైర్లు తగిలి మంటలు చెలరేగాయి. ఘటనలో గడ్డితో పాటు ట్రాక్టర్ దగ్ధమైంది.
ప్రమాదంలో రూ. 3 లక్షలు నష్టం వాటిల్లిందని రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసినా ఫలితం లేదని వాపోయాడు.
ఇదీ చదవండి: సరుకులు కొని ఇంటికి వెళ్తుండగా ప్రమాదం.. భార్య మృతి