ETV Bharat / crime

భార్యను మర్డర్ చేసి.. ఆత్మహత్యగా చిత్రీకరించి.. - ఖమ్మం జిల్లా నేర వార్తలు

ఆ అమ్మాయి కళాశాలలో బుద్ధిగా చదువుకుంటుంది. పెళ్లి చేయాలనే అతృతతో మేనల్లుడికిచ్చి పెళ్లిచేశారు ఆమె తల్లిదండ్రులు. ఎన్నో ఆశలతో అత్తగారింట్లో అడుగు పెట్టిన ఆ నవవధువు రెండు నెలలకే విగతజీవిగా మారింది.

The husband who murdered his wife in khammam distirct
భార్యపై అనుమానంతో ఉరేసి హత్య చేసిన భర్త
author img

By

Published : Feb 5, 2021, 6:08 PM IST

Updated : Feb 5, 2021, 8:32 PM IST

భార్యను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించే యత్నం చేసిన ఘటన ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం కొత్తలంకపల్లి గ్రామ శివారులోని కుక్కలగుట్ట వద్ద చోటుచేసుకుంది. జిల్లాలోని గురుపాలెం మండలం అయ్యవారిగూడెంకు చెందిన ఎర్రమల నవ్య రెడ్డి(20) సాయి స్ఫూర్తి ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్​ రెండో సంవత్సరం చదువుతోంది. గత సంవత్సరం డిసెంబర్​ 9న నవ్య రెడ్డికి ప్రగల్లపాడుకు చెందిన మేన బావ నాగ శేషురెడ్డితో పెళ్లి చేశారు.

The husband who murdered his wife in khammam distirct
భార్యపై అనుమానంతో ఉరేసి హత్య చేసిన భర్త

ఆత్మహత్యగా చిత్రీకరించి..

ఫిబ్రవరి 2న కళాశాలకు వెళ్లిన తన భార్య కనబడటం లేదని నాగ శేషు రెడ్డి ఆ మరుసటిరోజు ఎర్రుపాలెం పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేశాడు. ఇంతలోనే నవ్య రెడ్డి చరవాణి నుంచి సంక్షిప్త సందేశం వచ్చింది. అందులో తనకు బ్యాక్​ లాగ్స్​ ఉన్నాయని.. అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు ఉంది. ఈ సమాచారంతో కుటుంబ సభ్యులు దుఃఖంలో మునిగిపోయారు. కాని పోలీసుల దర్యాప్తులో కళ్లు బైర్లు కమ్మే నిజం బయటకొచ్చింది.

భార్యపై అనుమానంతో ఉరేసి హత్య చేసిన భర్త

పథకం ప్రకారమే

నవ్య రెడ్డిని తన భర్తే స్వయంగా ద్విచక్ర వాహనంపై తీసుకెళ్లినట్టు పోలీసులు సీసీ ఫూటేజీ ఆధారంగాగుర్తించారు. నాగ శేషు రెడ్డిని అదుపులోకి తీసుకోని విచారించగా భార్యను చంపింది తానేనని ఒప్పుకున్నాడు. పండ్ల రసంలో మత్తు మందు కలిపి నవ్య రెడ్డికి ఇచ్చాడు. వారిద్దరు కొత్తలంకపల్లి గ్రామ శివారులోకి రాగానే నవ్య రెడ్డి నిద్ర వస్తుందని చెప్పింది. బండి ఆపిన నాగ శేషు.. ఆమెను సమీపంలో ఉన్న చెట్లలోకి తీసుకెళ్లి చున్నీతో ఉరేశాడని వైరా ఏసీపీ సత్యనారాయణ వెల్లడించారు. ఆ తర్వాతే నవ్య చరవాణి నుంచి సంక్షిప్త సందేశం పంపినట్లు చెప్పారు. నిందితుడు నాగ శేషు రెడ్డిని అరెస్టు చేసి రిమాండ్​కు తరలించారు.

భార్యను మర్డర్ చేసి.. ఆత్మహత్యగా చిత్రీకరించి..

ఇదీ చదవండి: ఇన్​స్టాలో అమ్మాయిలతో పరిచయం.. అశ్లీల చిత్రాలతో వేధింపుల పర్వం

Last Updated : Feb 5, 2021, 8:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.