అభం శుభం ఎరుగని తమ కూతుర్ని మాయమాటలతో లొంగదీసుకుని ఏడాదిగా అత్యాచారానికి పాల్పడుతున్నాడంటూ బాలిక తల్లిదండ్రులు పోలీసులకి ఫిర్యాదు చేశారు. ఈ ఘటన మహబూబ్నగర్ జిల్లా చిన్న చింతకుంట మండలంలోని ఓ గ్రామంలో జరిగింది.
'12 ఏళ్ల బాలికను అదే గ్రామానికి చెందిన యువకుడు పరిచయం చేసుకుని.. మాయమాటలతో లొంగదీసుకున్నాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో.. ఒంటరిగా ఉన్న బాలికను బెదిరించి పలుమార్లు అత్యాచారానికి పాల్పడినట్లు' పోలీసులు తెలిపారు.
ఈ మధ్య కాలంలో బాలిక అనారోగ్యానికి గురవడం వల్ల అనుమానం వచ్చి తల్లిదండ్రులు ఆరా తీశారు. విషయం తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఇదీ చూడండి: ద్విచక్రవాహనాన్ని ఢీ కొట్టిన లారీ.. ఒకరు మృతి