తల్లిదండ్రులు నిద్రిస్తున్న సమయంలో ఓ బాలిక అదృశ్యమైన(girl missing) ఘటన హైదరాబాద్ బాలానగర్‌లో జరిగింది. బాలానగర్ వినాయక్ నగర్‌కు చెందిన జర్నమ్మ, శ్రీపతి దంపతులు వారి కుమారుడు, కుమార్తెతో యధావిధిగా తమ ఇంట్లో శుక్రవారం రాత్రి నిద్రించారు. శనివారం రోజు ఉదయం లేచి చూడగా తమ కుమార్తె గాయత్రి(16) కనిపించ లేదు.
చుట్టు పక్కల, బంధువుల వద్ద వెతికినా ఆచూకీ లభించలేదు. బాలిక ఇంట్లో నుంచి ఫోన్‌తోపాటు తన సోదరుడి సిమ్ కార్డును తీసుకెళ్లినట్లు బాలానగర్ పోలీసులకు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి: TPAD: అమెరికాలో తెలుగు వారి వనభోజనం.. చూసొద్దాం రండి