కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం లసుమన్నపల్లి గ్రామ పరిధిలోని కాకతీయ కాలువలో పడి గల్లంతైన యువకుడి మృతదేహం లభ్యమైంది. శుక్రవారం సాయంత్రం ఎల్కతుర్తి మండలం అనంతసాగర్ వద్ద ముజ్జిగ కార్తీక్ శవం కాలువలో తేలడాన్ని గమనించిన పోలీసుసు స్థానికుల సహాయంతో నీటి నుంచి బయటకు తీశారు.
కాకతీయ కాలువలో గురువారం ఈతకు వెళ్లిన కార్తిక్ నీటి ప్రవాహానికి కొట్టుకుపోయాడు. అతడి ఆచూకీ కోసం గాలింపు చేపట్టిన పోలీసులకు ఎల్కతుర్తి మండల సమీపంలోని అనంతసాగర్ గ్రామం వద్ద కాలువలో మృతదేహం కనిపించింది. స్థానికుల సహాయంతో శవాన్ని వెలికితీసారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి: మంత్రి అజయ్‌కుమార్ ఎంత దుర్మార్గుడంటే... ప్రశాంత్‌రెడ్డి సెటైర్