హనుమకొండలో విద్యార్థిని గొంతు కోసిన ప్రేమోన్మాది అజార్ శుక్రవారం అరెస్టు అయ్యారు. అయితే నిందితుడు అజార్‌ను పోలీసులు రహస్యంగా కోర్టులో హాజరుపర్చారు. న్యాయస్థానం అజార్‌కు 14 రోజుల రిమాండ్ విధించింది. నిందితుడిని పోలీసులు వరంగల్ జైలుకు తరలించారు. అజార్‌పై హత్యాయత్నం, అత్యాచారయత్నం, వేధింపుల కేసులు నమోదయ్యాయి. అజార్‌ను మరింత విచారించేందుకు పోలీసులు అతడిని కస్టడీకి కోరే అవకాశముంది.
అయితే ప్రేమను నిరాకరించినందుకే హనుమకొండలో యువతిపై నిందితుడు దాడి చేశాడు. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపించాం. శుక్రవారం గాంధీనగర్‌లో అజార్ అనే యువకుడు కత్తితో అనూష గొంతు కోశాడు. తీవ్ర గాయాలపాలైన యువతి ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. యువకుడి ప్రవర్తన నచ్చక యువతి దూరం పెట్టినా... కొంతకాలంగా వేధింపులకు పాల్పడ్డాడు. శుక్రవారం తెగించి ఈ దారుణానికి ఒడిగట్టాడు.
- రాఘవేందర్, సుబేదారి సీఐ
అసలు ఏం జరిగిందంటే... శుక్రవారం నాడు హనుమకొండలో ఓ విద్యార్థిని గొంతు కోశాడు ప్రేమోన్మాది. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. పట్టపగలు విద్యార్థిని ఇంట్లోకి చొరబడిన ఉన్మాది ఆమె గొంతుకోసి, పారిపోయాడు. వరంగల్ జిల్లా నర్సంపేటలోని లక్నేపల్లికి చెందిన విద్యార్థిని కాకతీయ విశ్వవిద్యాలయంలో ఎంసీఐ చివరి సంవత్సరం చదువుతూ పోటీపరీక్షలకు సిద్ధమవుతోంది. ఇందుకోసం తల్లిదండ్రులతో కలిసి హనుమకొండ గాంధీనగర్ కాలనీలో నివాసం ఉంటుంది. కాగా ప్రిపరేషన్ కోసం కొన్ని రోజుల క్రితం హైదరాబాద్ వెళ్లిన యువతి.. శుక్రవారం సాయంత్రం హనుమకొండకు తిరిగివచ్చింది.
వరంగల్ జిల్లా సంగెం మండలం ముండ్రాయికి చెందిన అజహర్.. గత కొంతకాలంగా విద్యార్థినిని ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. గురువారం ఆమె వచ్చిన విషయాన్ని తెలుసుకుని.. గాంధీనగర్‌లోని ఇంటి వద్ద ద్విచక్రవాహనంపై తిరిగాడు. కాగా శనివారం నుంచి కేయూలో పరీక్షలు ఉండటంతో ప్రాజెక్టు వర్క్‌కు సంబంధించి స్నేహితులతో ఫోన్‌లో మాట్లాడుతోంది. ఇంట్లో ఉన్న యువతి తల్లి.. పక్కింటికి వెళ్లిన సమయాన్ని అదునుగా చూసిన కిరాతకుడు ఫోన్ సంభాషణలో ఉన్న విద్యార్థినిపై దాడిచేశాడు. తాను వెంట తీసుకొచ్చిన కత్తితో ఆమె గొంతుకోసి అక్కడి నుంచి పరారయ్యాడు. రంగంలోకి దిగిన పోలీసులు... శుక్రవారమే అతన్ని అరెస్టు చేశారు. అయితే ఈరోజు రహస్యంగా కోర్టులో హాజరుపరిచారు.