సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అదృశ్యమైన వ్యక్తి మృతి చెందాడు. వివాహేతర సంబంధం కారణంగానే హత్య చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.
ఏం జరిగింది...?
సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం సుల్తాన్పూర్ గ్రామానికి చెందిన రమేశ్ బార్బర్‌గా జీవితం వెళ్లదీస్తున్నాడు. ఇదే గ్రామంలో ధర్మ కాంటలో పనిచేసే మెదక్ జిల్లాకు చెందిన మహేందర్‌తో స్నేహంగా ఉండేవాడు. ఈ క్రమంలో మహేందర్ భార్య శోభతో రమేశ్‌కు వివాహేతర సంబంధం ఏర్పడింది. ఇది గమనించిన మహేందర్ ఎలాగైనా హత్య చేయాలని తన స్వగ్రామానికి చెందిన సుభాశ్, ప్రకాశ్‌లతో ప్రణాళిక రచించాడు.
పథకం ప్రకారం...
గత నెల 25న రమేశ్‌ను ఇన్నోవా వాహనంలో జహీరాబాద్ మండలం హోతి గ్రామ శివారుకి తీసుకెళ్లి అక్కడ మద్యం తాగించారు. మత్తులో ఉండగా బీరు సీసాతో అతని తలపై కొట్టి సీసా పెంకులుతో గొంతుకోసి హత్య చేశారు. అనంతరం జిల్లాలోని వైకుంఠపురం దేవాలయానికి దర్శనానికి వెళ్లి.. కొత్త వస్త్రాలు వేసుకుని రక్తపు మరకలు ఉన్న దుస్తులను దేవాలయం వెనుక వ్యవసాయ పొలంలో పడేశారు.
కనిపించట్లేదని..
రమేశ్ కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు అమీన్పూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అదృశ్యం కేసు కేసుగా నమోదు చేసిన పోలీసులు మృతుని చరవాణి ఆధారంగా నిందితులను పట్టుకుని రిమాండ్‌కు తరలించారు.
ఇదీ చదవండి:గుర్తు తెలియని వ్యక్తి దారుణ హత్య..