రంగారెడ్డి జిల్లా చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలోని వాసవి కాలనిలో కారు బీభత్సం సృష్టించింది. అతివేగంతో కారు అదుపుతప్పి ఓ దుకాణంలోకి దూసుకెళ్లింది. కారు షాపులోకి దూసుకువెళ్లడంతో సామగ్రి ధ్వంసమైంది. సంబంధిత దృశ్యాలు సీసీ కెమెరాల్లో నిక్షిప్తమయ్యాయి. ఆ సమయంలో ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది.
ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ వెంకటేష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్థానికుల ఫిర్యాదు మేరకు.. ఘటన జరిగిన తీరుపై దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి: డీసీఎంను ఢీకొట్టిన కారు.. ఇద్దరు మృతి