ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లాలో కారు అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లింది. సత్తెనపల్లి నుంచి గుంటూరు వైపు వెళ్తున్న కారు... మేడికొండూరు మండలం పేరేచర్ల కాలువ వద్ద చేరగానే ఒక్కసారిగా అదుపుతప్పి కాలువలో పడిపోయి నీట మునిగింది.
గమనించిన స్థానికులు కారు వెనుక అద్దాలు పగలగొట్టి ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీశారు. కొద్ధి సమయం ఉపిరి అందక ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. కారులో స్త్రీనిధి జిల్లా అసిస్టెంటు, జిల్లా మేనేజర్ చెన్న కేశవులు, డ్రైవరు చిరంజీవి ఉన్నారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు.
ఇదీ చదవండి: ఎదురుగా వస్తోన్న వాహనాన్ని తప్పించబోయి.. బోల్తాపడిన కారు