ETV Bharat / crime

CC Footage: మద్యం మత్తులో డ్రైవింగ్​.. బాలుడిపైకి దూసుకెళ్లిన కారు

author img

By

Published : Jul 2, 2021, 8:06 AM IST

Updated : Jul 2, 2021, 9:57 AM IST

The car crashed into a boy standing in front of the house In Rajendranagar, Hyderabad
మద్యం మత్తులో డ్రైవింగ్​.. బాలుడిపైకి దూసుకెళ్లిన కారు

08:01 July 02

కారు బీభత్సం

బాలుడిపైకి దూసుకెళ్లిన కారు

హైదరాబాద్‌ రాజేంద్రనగర్ పోలీస్​స్టేషన్​ పరిధిలోని... ప్రేమావతిపేటలో గత నెల 27న జరిగిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ బాలుడి పరిస్థితి విషమంగా ఉంది. మద్యం సేవించి వాహనం నడిపిన డ్రైవర్... ఇంటి ముందు కూర్చున్న బాలుడిని ఢీకొట్టాడు. రాత్రి తొమ్మిదిన్నర గంటల సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. 

ప్రమాద శబ్ధానికి స్థానికులు ఒక్కసారిగా బయటికి వచ్చారు. కారులో ఉన్న వాళ్లు పారిపోతుండగా.. అందులో డ్రైవర్​ను స్థానికులు పట్టుకున్నారు. మద్యం సేవించినట్లు గుర్తించి చితకబాదారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో... ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. గాయపడ్డ బాలుడిని ఆస్పత్రికి తరలించగా ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు.

ఇదీ చూడండి: MURDER : గొంతులో పొడిచి.. మెడకు చున్నీ బిగించి.. ప్రేమోన్మాది ఘాతుకం

Last Updated : Jul 2, 2021, 9:57 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.