ముందు వెళుతున్న లారీని బస్సు ఢీకొనడంతో సుమారు 30 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన తిమ్మాపూర్ మండలం ఇందిరానగర్ వద్ద ఆదివారం రాత్రి 11:00 గంటలకు చోటుచేసుకుంది. హైదరాబాద్‌లోని బాలానగర్‌కు చెందిన యువకుడికి చొప్పదండి మండలం వెదురుగట్టకు చెందిన యువతితో శుక్రవారం వివాహం జరిగింది. ఆదివారం వధువు ఇంటివద్ద జరిగిన విందుకు వరుడి తరఫున సుమారు 50 మంది కూకట్‌పల్లిడిపో బస్సులో తరలివచ్చారు.
తిరిగి వస్తుండగా..
కార్యక్రమం అనంతరం బస్సులో తిరిగి వెళుతుండగా తిమ్మాపూర్ మండలం ఇందిరానగర్ వద్ద ముందు వెళుతున్న లారీని బస్సు అతివేగంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సులో ఉన్న వరుడు, వధువుతోపాటు సుమారు 30 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. క్షతగాత్రులను కరీంనగర్ ఆసుపత్రికి తరలించినట్లు వివరించారు.
ఇదీ చూడండి: సైనెడ్ కలపడం వల్లే ముగ్గురు మృతి చెందారు!