హైదరాబాద్ జవహర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎనిమిదేళ్ల బాలుడు అదృశ్యమయ్యాడు. బాలాజీనగర్‌కు చెందిన వేణుగోపాల్ ఎలక్ట్రిషియన్‌గా పనిచేస్తున్నాడు. అతని చిన్నకుమారుడు సిద్ధార్థ బుధవారం ఉదయం స్నేహితులతో ఆడుకోవడానికి వెళ్లి ఇప్పటికీ ఇంటికి తిరిగిరాలేదని వేణుగోపాల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కేసు నమోదు చేసుకున్న జవహర్‌నగర్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సీసీకెమెరాల్లోని దృశ్యాలను పరిశీలిస్తున్నారు. ఎవరికైనా తమ కుమారుడి ఆచూకీ తెలిస్తే సమాచారం ఇవ్వాలని తల్లిదండ్రులు వేడుకుంటున్నారు.
- ఇదీ చూడండి : యువ ఇంజినీర్ అవయవదానం- నలుగురి జీవితాల్లో వెలుగు