Mumbojipet farmers Attack on forest officers: కామారెడ్డి జిల్లాలో అటవీశాఖ అధికారులు.. రైతుల మధ్య ఘర్షణ నెలకొంది అటవీశాఖ అధికారులపై గిరిజనులు దాడి చేశారు. లింగంపేట్ మండలం ముంబాజిపేట తండాలో ఈ ఘటన జరిగింది. గిరిజనులు ట్రాక్టర్లతో పొలం చదును పనులు చేపట్టగా... అటవీశాఖ సిబ్బంది రైతులను అడ్డుకున్నారు. ముంబాజి తండా, కొండాపూర్ గ్రామాలకు చెందిన ఆరుగురు రైతులు అటవీ భూమిని అక్రమంగా సాగు చేస్తున్నారని సమాచారం మేరకు వెళ్లిన అటవీ బీట్ ఆఫీసర్లు వారిని అడ్డగించారు. ఈ నేపథ్యంలో రైతులు కర్రలతో దాడికి దిగారు. ఈ ఘటనలో ఇద్దరు బీట్ పోలీసులకు తీవ్ర గాయాలయ్యాయి.
వెంటనే అప్రమత్తమైన పోలీసులు... ఫారెస్ట్ అధికారులను ఆస్పత్రికి తరలించారు. కొండాపూర్ అటవీ బీట్ పోలీస్ ఫిరోజ్ ఖాన్, జిల్లేపల్లి బీట్ పోలీస్ మహేశ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన అధికారులు కామారెడ్డి ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఇదీ చదవండి: Car Fire : సికింద్రాబాద్ ఫ్లైఓవర్‌పై కారు దగ్ధం..