Sexual assault on children: చిన్నారులు, మహిళలపై లైంగిక దాడులకు వ్యతిరేకంగా ప్రభుత్వం ఎన్ని కఠిన చట్టాలు తెచ్చినా.. కామాంధుల తీరు మాత్రం మారట్లేదు. కామ వాంఛ తీర్చుకునేందుకు చిన్నా పెద్ద, వావివరుసలు మరిచి వారితో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారు. ఆడది ఒంటరిగా కనిపిస్తే వారికి సాయం చేయాలనే మానవతా దృక్పథాన్ని మరిచి తమలోని రాక్షసుడిని బయటకు తీస్తున్నారు. చిన్నారులకు మాయమాటలు చెప్పి వారిని మభ్య పెట్టి లైంగిక దాడులకు పాల్పడుతున్నారు. దీంతో ఆటపాటలు, ప్రేమానురాగాలు, చదువులతో సరదాగా గడవాల్సిన బాల్యం.. ఇలాంటి చేదు అనుభవాలతో దినదిన గండంగా మారిపోయింది. నాలుగేళ్ల బాలికను ఆటో డ్రైవర్ మభ్య పెట్టి.. చిన్నారిపై ఘాతుకానికి యత్నించాడు. సమయానికి తండ్రి రావడంతో ఆ పాప సురక్షితంగా బయటపడింది.
ఇదీ చదవండి: మాజీ ప్రియుడితో కలిసి బాలుడిపై అఘాయిత్యం.. ఆపై బెదిరించి..
మాయమాటలు చెప్పి
Sexual harassment on children: రంగారెడ్డి జిల్లా పహడి షరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానికంగా నివసించే ఆటో డ్రైవర్ రమేశ్ గురువారం.. చిన్నారిని మాయమాటలతో మభ్యపెట్టి బాలికను ఇంటి వద్ద నుంచి నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లాడు. ఈ క్రమంలో కూతురు కనపడకపోవడంతో తల్లి భర్తకు ఫోన్ చేసింది. హుటాహుటిన ఇంటికి చేరుకున్న బాలిక తండ్రి... చుట్టుపక్కల వెతికారు. బాలిక ఆచూకీ దొరకకపోవడంతో.. తన స్నేహితుడితో కలిసి ద్విచక్రవాహనంపై అంతా గాలించారు.
నిర్మానుష్య ప్రాంతంలో
assault on girl: చివరికి ఓ నిర్మానుష్య ప్రదేశంలో చిన్నారిని, ఆటో డ్రైవర్‌ను గమనించిన తండ్రి.. అక్కడికి చేరుకున్నారు. భయాందోళనలో ఉన్న చిన్నారిని చూసి భయపడిన తండ్రి ఏం జరిగిందని అడిగారు. డ్రైవర్ తనపై లైంగిక దాడికి యత్నిస్తున్నట్లు చెప్పిన కూతురి మాటలు విని తండ్రి ఆందోళనకు గురయ్యారు. వెంటనే చిన్నారిని ఇంటికి తీసుకెళ్లి.. జరిగిందంతా భార్యకు వివరించాడు. వెంటనే ఆటో డ్రైవర్‌పై పహాడి షరీఫ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి.. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
ఇదీ చదవండి: boy friend cheating: ప్రేమన్నాడు.. పెళ్లి అన్నాడు.. శారీరకంగా దగ్గరై... ఇప్పుడేమో!