Case filed on MIM MLA: యువకుడిపై దాడి చేసిన కేసులో చార్మినార్ ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ఖాన్పై పోలీసులు కేసు నమోదు చేశారు. చార్మినార్ బస్టాండ్ సమీపంలో జిలానీ అనే యువకుడు తన నివాసం వద్ద కూర్చోగా.... అటుగా వెళ్తున్న ఎమ్మెల్యే ముంతాజ్ ఖాన్ కారులో నుంచి దిగి... కొట్టినట్లు జిలాని పేర్కొన్నాడు. ఎమ్మెల్యే చెంపదెబ్బ కొట్టిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు ఎమ్మెల్యేపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
సలాం చేయనందుకు చార్మినార్ ఎమ్మెల్యే ముంతాజ్ ఖాన్ తనను కొట్టాడని హుస్సేనీ ఆలం పోలీసుస్టేషన్‌లో గులాం గౌస్ జీలాని అనే వ్యక్తి ఫిర్యాదు చేశాడు. శనివారం అర్ధరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. బాధితునికి ఉస్మానియా ఆస్పత్రిలో పోలీసులు వైద్యపరీక్షలు చేయించారు.