TDP Leaders Arrest in Gudiwada: : తెదేపా, వైకాపా కార్యకర్తల పోటాపోటీ ఆందోళనలు.. కృష్ణా జిల్లా గుడివాడలో ఉద్రిక్తతకు దారితీశాయి. సంక్రాంతి సందర్భంగా.. గుడివాడలోని కే-కన్వెన్షన్‌లో మంత్రి కొడాలి నాని క్యాసినోలు నిర్వహించారంటూ.. తెదేపా బృందం నిజనిర్ధరణకు వెళ్లగా.. వారిని వెనక్కి పంపాలంటూ వైకాపా శ్రేణులు ఆందోళనకు దిగాయి. గుడివాడ పార్టీ కార్యాలయం నుంచి కే-కన్వెన్షన్‌కు బయల్దేరిన నేతలను.. నెహ్రూ చౌక్ వద్ద పోలీసులు అడ్డుకోగా.. ఆ పక్క వీధిలో వైకాపా శ్రేణులు రోడ్డుపై బైఠాయించాయి. ఇరువర్గాల మోహరింపుతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు బలవంతంగా తెదేపా బృందాన్ని వాహనాల్లో ఎక్కించి తరలించారు.
తెదేపా నాయకుల అరెస్టు తర్వాత.. వైకాపా కార్యకర్తలు రెచ్చిపోయారు. బొండా ఉమ కారు అద్దాన్ని పగలగొట్టారు. గుడివాడ తెదేపా కార్యాలయంపై రాళ్లు రువ్వారు. తెదేపాకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ.. రాళ్లు రువ్వారు. వైకాపా శ్రేణులను పోలీసులు కనీసం నిలువరించలేదని తెదేపా నేతలు మండిపడ్డారు.
కొడాలి నానిని వెంటనే బర్తరఫ్ చేయాలి: బొండా ఉమ
సొంత కన్వెన్షన్ సెంటర్‌లో కొడాలి నాని క్యాసినో నిర్వహించారని తెదేపా నేత బొండా ఉమామహేశ్వరరావు ఆరోపించారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడారు. ‘‘ఎన్టీఆర్ టు వైఎస్సార్ పేరిట క్యాసినో నిర్వహించారు. ఎన్టీఆర్ పేరుతో అసాంఘిక కార్యకలాపాలను సహించం. సొంత కన్వెన్షన్ సెంటర్‌లో గోవా సంస్కృతిని ప్రవేశపెట్టారు. హైదరాబాద్‌లో కరోనా చికిత్స తీసుకున్నా అంటే సరిపోతుందా? ఈ వ్యవహారంలో మంత్రి కొడాలి నానిని తప్పించే వరకు న్యాయపోరాటం చేస్తాం. కొడాలి నాని దొరికిపోయిన దొంగ.. వెంటనే ఆయన్ను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలి’’ అని బొండా ఉమ డిమాండ్ చేశారు.
అంతకుముందు మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి బయల్దేరిన కమిటీ సభ్యులను పోలీసులు అడుడగునా.. అడ్డుకునే ప్రయత్నం చేశారు. దావులూరు టోల్ గేట్, పామర్రులో.. వాహనాలు ఆపి సోదాలు చేశారు. ఒక కారుకు మించి అనుమతించబోమని.. పామర్రు- గుడివాడ రహదారి మలుపు వద్ద అడ్డుకున్నారు. తెదేపా నేతలు వాహనాలు దిగి బారికేడ్లు దాటుకుంటూ.. ముందుకెళ్లే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో.. పోలీసులు 10 వాహనాలకు అనుమతినిచ్చారు.
తెదేపా నేతల అరెస్టును ఖండించిన లోకేశ్
మహానుభావుల పురిటిగడ్డ గుడివాడని గడ్డం గ్యాంగ్ భ్రష్టు పట్టించిందని.. తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శించారు. కే-కన్వెన్షన్ జూదానికి అడ్డాగా మారిన విషయం ప్రపంచం మొత్తం తెలిసినా.. వైకాపా రంగులతో కళ్లు మూసుకుపోయిన పోలీసులకు కనిపించలేదని ధ్వజమెత్తారు. క్యాసినో నడిపి ప్రజల నుంచి వందల కోట్లు కాజేసిన గడ్డం గ్యాంగ్‌ను వదిలేసి.. నిజ నిర్ధరణకు వెళ్లిన తెదేపా నేతలను అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని అయన తీవ్రంగా ఖండించారు. గుడివాడని గోవాడగా మార్చేసిన సూత్రధారులపై.. చర్యలు తీసుకొని అరెస్ట్ చెయ్యాలని డిమాండ్ చేశారు.
-
గుడివాడ లో టిడిపి కార్యాలయంపై వైసిపి గూండాల దాడి, సీనియర్ నేత @Bondauma_MLA గారి కారుని ధ్వంసం చెయ్యడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. వైసిపి గూండాలు రెచ్చిపోతున్నా ప్రేక్షకపాత్ర పోషించడం..,(1/2)#ArrestGutkaMatkaNani#GutkaMatkaNani pic.twitter.com/A6vEmX9MMW
— Lokesh Nara (@naralokesh) January 21, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">గుడివాడ లో టిడిపి కార్యాలయంపై వైసిపి గూండాల దాడి, సీనియర్ నేత @Bondauma_MLA గారి కారుని ధ్వంసం చెయ్యడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. వైసిపి గూండాలు రెచ్చిపోతున్నా ప్రేక్షకపాత్ర పోషించడం..,(1/2)#ArrestGutkaMatkaNani#GutkaMatkaNani pic.twitter.com/A6vEmX9MMW
— Lokesh Nara (@naralokesh) January 21, 2022గుడివాడ లో టిడిపి కార్యాలయంపై వైసిపి గూండాల దాడి, సీనియర్ నేత @Bondauma_MLA గారి కారుని ధ్వంసం చెయ్యడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. వైసిపి గూండాలు రెచ్చిపోతున్నా ప్రేక్షకపాత్ర పోషించడం..,(1/2)#ArrestGutkaMatkaNani#GutkaMatkaNani pic.twitter.com/A6vEmX9MMW
— Lokesh Nara (@naralokesh) January 21, 2022
కొడాలి నానికే ఘనత - కొల్లు రవీంద్ర
"సంక్రాంతి సందర్భంగా కోడి, ఎడ్ల పందేలు నిర్వహిస్తుంటారు. గుడివాడలో కొడాలి నాని మాత్రం క్యాసినో నిర్వహించారు. జూద క్రీడ నిర్వహించిన ఘనత కొడాలి నానికే దక్కుతుంది. పోలీసు వ్యవస్థ ఏం చేస్తుందో తెలియట్లేదు" - కొల్లు రవీంద్ర, మాజీ మంత్రి
ఇదీ చదవండి: కలకలం రేపుతున్న ‘క్యాసినో’ కాక.. గుడివాడలో ఉద్రిక్తత
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!