ETV Bharat / crime

Suicide Video: స్విగ్గీ బాయ్​ సూసైడ్​.. సెల్ఫీ వీడియోతో సందేశం.. ఎవరికంటే..? - సెల్పీ వీడియో

వ్యక్తిగత కారణాల కారణంగా ఓ స్పిగ్గీ బాయ్​ ఆత్మహత్య చేసుకున్నాడు. సెల్పీ వీడియో తీసుకుని మరీ.. ఉరేసుకుని బలవన్మరణం చెందాడు. ఈ ఘటన సికింద్రాబాద్​లోని జవహర్​నగర్ పోలీస్​స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.

swiggi delivery boy selfie suicide in Secunderabad

author img

By

Published : Oct 21, 2021, 4:48 AM IST

స్విగ్గీ బాయ్​ సూసైడ్​.. సెల్ఫీ వీడియోతో సందేశం.. ఎవరికంటే..?

సికింద్రాబాద్​లోని జవహర్​నగర్ పోలీస్​స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. నవరస గార్డెన్ వెనుక ఉన్న మోహన్​రావు కాలనీలో అశోక్(29) అనే స్విగ్గీ డెలివరీ బాయ్ ఉరేసుకుని మృతిచెందాడు. ఉరేసుకునే ముందు సెల్ఫీ వీడియో తీసుకుని మరీ మిత్రులకు పంపించాడు. ఈ వీడియోలో కన్నయ్య అని సంబోధిస్తూ.. ఓ వ్యక్తికి సందేశం ఇచ్చాడు. అయితే అది ఎలాంటి సందేశమన్నది స్పష్టంగా తెలియకపోవటంతో ఆత్మహత్యకు గల కారణం తెలియరాలేదు.

అశోక్​కు మూడేళ్ల కిందట వివాహం జరిగింది. ఉదయం అతడి భార్య తల్లిదండ్రులు.. నగరంలో ఓ పని నిమిత్తం వచ్చారు. ఆ పని ముగించుకుని సాయంకాలం తిరిగి ఇంటికి వచ్చే లోపే అశోక్​ విగతజీవిగా వేలాడుతూ కనిపించాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో అశోక్​ ఆత్మహత్య చేసుకుని మరణించాడు. వెంటనే కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. పరిశీలించారు. కేసు నమోదు చేసి.. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. అయితే... అశోక్​ ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడన్న విషయం తెలియాల్సి ఉంది. సెల్ఫీ వీడియోలో మాట్లాడుతూ.. తన నానమ్మ దగ్గరికి వెళ్లిపోతున్నట్టు చెప్పటం.. ఉరివేసుకుని ప్రాణాలు వదిలే దృశ్యాలు అందర్ని కలచివేస్తున్నాయి.

ఇదీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.