పోలీసు గృహ నిర్మాణ సంస్థకు చెందిన ముగ్గురు ఇంజినీర్లను సస్పెండ్(engineers suspension) చేస్తూ ఎండీ సంజయ్ కుమార్ జైన్ ఉత్తర్వులు జారీ చేశారు. శాఖాపరమైన విచారణ పూర్తయ్యే వరకు ముగ్గురు సస్పెన్షన్ అమల్లో ఉంటుందని పేర్కొన్నారు. పోలీస్ గృహ నిర్మాణ సంస్థ వరంగల్ ఈఈ ఈశ్వర్, నిజామాబాద్, నల్గొండ సబ్ డివిజన్ డీఈఈలు రాందాస్, విఠల్‌సింగ్‌లను సస్పెండ్ చేశారు. నిబంధనలు ఉల్లంఘించారని సంస్థ ఎండీ సంజయ్ కుమార్ జైన్ వెల్లడించారు.
సంస్థలో విశ్రాంత ఉద్యోగి పెత్తనం ఎక్కువైందంటూ ముగ్గురు ఇంజినీర్లు మీడియా సమావేశం నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారంటూ ముగ్గురు ఇంజినీర్లపై వేటు వేశారు.
ఇదీ చదవండి: కోర్టులో పాఠం చెప్పిన ధర్మాసనం.. న్యాయమూర్తులే గురువులు