ETV Bharat / crime

Farmer Death in Atmakur : పంటపై వానర మూకల దాడి.. ఆగిన అన్నదాత గుండె

Farmer Death in Atmakur : భూమినే నమ్ముకున్నాడు ఆ మట్టిమనిషి. పెట్టుబడి పెట్టాడు. ఆరుగాలం కష్టపడ్డాడు. కానీ... రాత్రికి రాత్రే ఆ పంట పాడైపోయింది. ఒక్కసారిగా వానర మూకలు పంటపై దాడి చేశాయి. చేతికందవచ్చిన పంటను కళ్లముందే కోతులు చెడగొడుతుంటే ఆ అన్నదాత గుండె ఆగింది.

Farmer Death in Atmakur,  farmer died due to monkeys Spoiling crop
పంటపై వానర మూకల దాడి.. ఆగిన అన్నదాత గుండె
author img

By

Published : Jan 17, 2022, 11:58 AM IST

Farmer Death in Atmakur : చేతికొచ్చిన వేరుశనగ పంటపై వానర మూకలు దాడి చేస్తుంటే కాపాడటానికి ఆ రైతు శతవిధాలా ప్రయత్నించారు. అయినా.. ఫలితం లేకపోవడంతో తల్లడిల్లిన ఆ రైతు గుండె ఆగి పంట చేనులోనే కుప్పకూలిపోయారు. ఈ విషాద సంఘటన సూర్యాపేట జిల్లా ఆత్మకూర్‌(ఎస్‌) మండల కేంద్రంలో ఆదివారం చోటుచేసుకుంది.

ఎలా జరిగింది?

కుటుంబసభ్యుల వివరాల ప్రకారం.. ఆత్మకూర్‌(ఎస్‌)కు చెందిన పందిరి రవీందర్‌రెడ్డి (55) ఎకరం విస్తీర్ణంలో వేరుశనగ పంట సాగు చేశారు. శనివారం రాత్రి వర్షం కురవడంతో ఆదివారం ఉదయం పంటను చూసేందుకు వెళ్లారు. అప్పటికే చేనులో వర్షపు నీరు నిలిచి ఉండగా పెద్ద సంఖ్యలో వచ్చిన కోతుల గుంపు వేరుశనగ మొక్కలను పీకేస్తుండటాన్ని గమనించారు. దీంతో తోటి రైతుల సహకారంతో వాటిని తరిమికొట్టేందుకు పరుగులు తీశారు. సగానికిపైగా పంటను కోతులు చెడగొట్టాయని, దిగుబడి రాక నష్టపోతానంటూ ఆవేదన చెందుతూ ఒక్కసారిగా కుప్పకూలిపోయారు.

గ్రామంలో విషాద ఛాయలు

తోటి రైతులు వెంటనే ఆయనను గ్రామంలోని ప్రైవేటు వైద్యుడి వద్దకు తీసుకెళ్లగా మరణించినట్లు తెలిపారు. రైతు మృతితో గ్రామంలో విషాదం అలుముకుంది. పంటలను కోతుల బెడద నుంచి రక్షించాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు.

ఇదీ చదవండి: Cyber Crimes: మీకు ఇలాంటి మెసేజ్​లు వస్తున్నాయా... అయితే ఓ లుక్కేయండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.