ETV Bharat / crime

వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు మధ్యంతర బెయిల్.. - అనంతబాబుకు మధ్యంతర బెయిల్

BAIL TO YCP MLC ANATABABU: వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. కాకినాడకు చెందిన డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్యకేసులో అనంతబాబుకు మధ్యంతర బెయిల్ ఇస్తూ.. బెయిల్ నిబంధనలను ట్రయర్ కోర్టు నిర్దేశిస్తుందని పేర్కొంది.

BAIL
BAIL
author img

By

Published : Dec 12, 2022, 2:08 PM IST

BAIL TO YCP MLC ANATABABU: వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. కాకినాడకు చెందిన డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్యకేసులో అనంతబాబుకు మధ్యంతర బెయిల్ ఇస్తూ.. బెయిల్ నిబంధనలను ట్రయర్ కోర్టు నిర్దేశిస్తుందని పేర్కొంది. గతంలో పలుమార్లు ఏపీ హైకోర్టులో.. బెయిల్ కోసం పిటీషన్ దాఖలు చేశారు. బెయిల్ పిటిషన్​ను డిస్మిస్ చేస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో అనంతబాబు సుప్రీంకోర్టును ఆశ్రయించగా మధ్యంతర బెయిల్ మంజారు చేసింది. ప్రస్తుతం ఆయన రిమాండ్‌ ఖైదీగా రాజమండ్రి సెంట్రల్‌ జైలులో ఉన్నారు. బెయిల్ పత్రాలు అందిన తర్వాత అనంతబాబును విడుదల చేసే అవకాశముంది.

అసలేం జరిగిందంటే..: సుబ్రహ్మణ్యం.. ఐదేళ్లపాటు ఎమ్మెల్సీ అనంతబాబు దగ్గర డ్రైవర్‌గా పనిచేశారు. ఇటీవల కొంతకాలం క్రితం డ్రైవర్‌ పని మానేసి, ఇంటి దగ్గరే ఉంటున్నారు. గురువారం (2022 మే 19) రాత్రి పదిన్నర గంటలకు స్నేహితులతో కలిసి కాకినాడ కొండయ్యపాలెంలో సుబ్రహ్మణ్యం ఉండగా.. ఎమ్మెల్సీ అనంతబాబు కారులో అక్కడికి వచ్చి సుబ్రహ్మణ్యాన్ని తీసుకెళ్లారు. అర్ధరాత్రి పన్నెండున్నర గంటలకు సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులకు ఎమ్మెల్సీ ఫోన్‌ చేసి.. నాగమల్లితోట దగ్గర ప్రమాదం జరిగిందని చెప్పారు. సుబ్రహ్మణ్యాన్ని ఆసుపత్రికి తీసుకెళ్తున్నానని, అక్కడికి రమ్మని పిలిచారు. మళ్లీ రాత్రి ఒకటిన్నరకు అనంతబాబే తన కారులో సుబ్రహ్మణ్యం మృతదేహాన్ని వెనుక సీటులో వేసుకుని తీసుకొచ్చారు.

మృతదేహాన్ని తీసుకోవాలని ఎమ్మెల్సీ సూచించగా.. నీరు కారుతూ, ఇసుకతో ఉండటంతో అసలేం జరిగిందని సుబ్రహ్మణ్యం కుటుంబసభ్యులు అడిగారు. బండి ఢీకొట్టిందని ఎమ్మెల్సీ చెప్పడంతో.. తమకు చెప్పాలి గానీ మీరెలా తీసుకొచ్చారని వారు ప్రశ్నించారు. తనతో గొడవ పడొద్దని, శవాన్ని కిందకు దించాలని ఆయన గద్దించారు. శవాన్ని అలాగే ఉంచాలని, కేసు నమోదయ్యాకే దింపుతామని కుటుంబసభ్యులు స్పష్టంచేశారు. వెంటనే దించి జీజీహెచ్​కు తీసుకెళ్లాలంటూ కారులో శవాన్ని ఉంచి తాళం వేసుకుని వెళ్లిపోతుండగా.. సుబ్రహ్మణ్యం కుటుంబసభ్యులు అడ్డుకున్నారు. ఆయన మళ్లీ వచ్చి కారు డోర్‌ తీసి.. తాళం తీసుకుని వెళ్లిపోయారు. మృతదేహాన్ని అపార్టుమెంట్ వద్దకు తేవటం, అనంతబాబు బెదిరించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.

ఇవీ చదవండి:

బీఆర్​ఎస్ పార్టీ​ కేంద్ర కార్యాలయం ప్రారంభోత్సవానికి రంగం సిద్ధం

ముగిసిన ఎమ్మెల్సీ కవిత సీబీఐ విచారణ.. 7 గంటల పాటు కొనసాగిన ప్రశ్నోత్తరాలు

ముగిసిన ఇండియన్‌ రేసింగ్‌ లీగ్‌.. విజేతగా గాడ్​స్పీడ్ కొచ్చి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.