హైదరాబాద్ సుల్తాన్‌బజార్‌లోని ప్రభుత్వాస్పత్రి నర్సింగ్ సూపరింటెండెంట్ బ్లాండినా(57) మృతి చెందారు. గత నెలలో కరోనా బారిన పడిన ఆమె.. చికిత్స పొందారు. తర్వాత తిరిగి విధుల్లో చేరారు. ఈ క్రమంలో ఓరోజు అస్వస్థతకు గురైన బ్లాండినా.. బర్కత్‌పురలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. చికిత్స పొందుతూ గురువారం కన్నుమూశారు.
బ్లాండినా మృతికి ఉన్నతాధికారుల తీరే కారణమని కుటుంబ సభ్యులు ఆరోపించారు. కరోనా నుంచి కోలుకున్న తర్వాత.. ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ ఉన్నా వెంటనే విధుల్లో చేరాలని అధికారులు ఒత్తిడి తెచ్చారని తెలిపారు. ఫీవర్ ఆస్పత్రిలో బ్లాండినా.. 25 ఏళ్లు నర్సుగా సేవలందించారు. నర్సింగ్ సూపరింటెండెంట్‌గా పదోన్నతి రావడం వల్ల నాలుగు నెలల క్రితం సుల్తాన్ బజార్ ప్రభుత్వాస్పత్రిలో చేరారు.
- ఇదీ చదవండి : హైదరాబాద్ నుంచి విశాఖకు కొరియర్లో ‘రెమ్‌డెసివిర్’!