ETV Bharat / crime

గుండె నొప్పి భరించలేక వృద్ధుడి ఆత్మహత్య

గుండె నొప్పి భరించలేక ఓ వృద్ధుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలో చోటు చేసుకుంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో అర్ధరాత్రి ఉరి వేసుకుని చనిపోయాడు. ఇటీవలే అతని భార్యకు కరోనా సోకడంతో హైదరాబాద్​లో చికిత్స తీసుకుంటుంది.

గుండె నొప్పి భరించలేక వృద్ధుడి ఆత్మహత్య
గుండె నొప్పి భరించలేక వృద్ధుడి ఆత్మహత్య
author img

By

Published : May 26, 2021, 9:21 AM IST

యాదాద్రిభువనగిరి జిల్లాలో గుండె నొప్పి భరించలేక వృద్ధుడు ఆత్మహత్య చేసుకున్నాడు. యాదగిరిగుట్ట మండలం బాహుపేటలో ఈ ఘటన చోటు చేసుకుంది. అర్ధరాత్రి ఇంట్లో ఒక్కడే ఉన్న సమయంలో గుండె నొప్పి ఎక్కువగా రావటంతో.. నొప్పి భరించలేక రాత్రి ఫ్యాన్​కు ఉరేసుకుని పంజాల చిన్న భిక్షపతి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

సూసైడ్ నోట్...

గుండె నొప్పి భరించలేకే తాను ఆత్మహత్య చేసుకున్నట్లు చొక్కా జేబులో సూసైడ్ నోట్ లభించింది. ఇటీవల మృతుడి భార్యకు కరోనా రావడంతో హైదరాబాద్​లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. వృద్ధుని మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. భిక్షపతి మృతిపై తమకు ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.

ఇదీ చూడండి: కమలనాథుల వరుసమంతనాలు.. స్వతంత్ర పోటీకే ఈటల​ మొగ్గు..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.