ఏపీలోని విశాఖ జిల్లా కంచరపాలెం సమీపంలోని మేఘాద్రిపేట డిఫెన్స్‌కాలనీలో ఎస్.మాధవీలత, భర్త శివకృష్ణతో కలిసి నివసిస్తున్నారు. మాధవీలత అన్నయ్య సిరిశెట్టి కృష్ణాంజనేయులు(30) ఇండస్ట్రియల్ ఎస్టేట్‌లో పనిచేస్తూ గత రెండేళ్లుగా చెల్లి ఇంట్లోనే ఉంటున్నాడు. అతడికి చిన్నప్పటి నుంచీ వినికిడి సమస్య ఉంది. దాని కారణంగా ఎన్ని పెళ్లి సంబంధాలు చూస్తున్నా కుదరడం లేదని తరచూ బాధపడేవాడు.
ఈ నేపథ్యంలో శనివారం ఉదయం చెల్లి, బావ పనిమీద బంధువుల ఇంటికి వెళ్లారు. మరుసటి రోజు ఇంటికి తిరిగొచ్చేసరికి తలుపులు వేసి ఉండడంతో బావ శివకృష్ణ.. కృష్ణాంజనేయుల్ని గట్టిగా పిలిచాడు. అతని నుంచి సమాధానం రాకపోవడంతో స్థానికుల సహాయంతో తలుపులు తెరిచి చూడగా ఉరివేసుకొని కనిపించాడు. చెల్లి మాధవీలత కంచరపాలెం పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: TSRTC: ‘ఆమె’ చెయ్యెత్తితే బస్సు ఆగాల్సిందే...!