ETV Bharat / crime

నాన్న మందలిస్తాడనే భయం.. తొమ్మిదో తరగతి విద్యార్థి బలవన్మరణం - తెలంగాణ తాజా వార్తలు

Student Suicide in mahabubabad : పిల్లలకు తలిదండ్రులంటే భయం ఉండటం సహజమే. అది అతిగా మారితే అనర్థాలకు దారి తీస్తుంది. తాజాగా మహబూబాబాద్ జిల్లాలో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. పాఠశాలకు వెళ్లలేదన్న విషయం తన తండ్రికి తెలిస్తే మందలిస్తాడేమోనన్న భయంతో ఓ విద్యార్థి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

పురుగుల మందు తాగి ఆత్మహత్య
పురుగుల మందు తాగి ఆత్మహత్య
author img

By

Published : Jan 8, 2023, 5:11 PM IST

Student Suicide in mahabubabad : స్కూల్​కు వెళ్లలేదనే విషయం తండ్రికి తెలిస్తే మందలిస్తాడనే భయంతో 9వ తరగతి విద్యార్థి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం బేరువాడ శివారు గుడి తండాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. తండాకు చెందిన విష్ణు మహబూబాబాద్​లోని గాదెరుక్మారెడ్డి పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు. కొన్ని రోజులు పాఠశాల హాస్టల్​లో ఉన్నాడు. ఆ తర్వాత రోజూ ఇంటి నుంచే పాఠశాలకు వెళ్లి వస్తున్నాడు.

ఈ క్రమంలోనే తన తండ్రి పొలంలో కలుపు తీస్తున్న రోజు విష్ణు పాఠశాలకు వెళ్లకుండా తండాలోనే ఉన్నాడు. ఈ విషయం తన తండ్రికి తెలిస్తే మందలిస్తాడనే భయంతో 4 రోజుల క్రితం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. అది గమనించిన కుటుంబసభ్యులు వెంటనే మహబూబాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఐసీయూలో చికిత్స పొందుతూ విష్ణు మృతి చెందాడు. దీంతో తండాలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.