ETV Bharat / crime

RAPE: సవతి తండ్రి అరాచకం... మూడేళ్లుగా కుమార్తెపై అత్యాచారం - మూడేళ్లుగా కుమార్తెపై అత్యాచారం

తనకు తోడుగా.. పిల్లలకు రక్షణగా ఉంటాడని నమ్మి ఓ మహిళ రెండో పెళ్లి చేసుకుంది. కానీ అతను మాత్రం ఆమె కూతురుపై కన్నేశాడు. తండ్రిలా చూసుకోవాల్సిన వాడు.. రాక్షసుడిలా బెదిరించి మూడేళ్లుగా అత్యాచారం చేస్తున్నారు. ఎవరికైనా చెప్తే అంతు చూస్తానంటూ భయపెట్టాడు. కానీ విషయం గ్రహించిన తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

step-father-rapped-his-daughter
మూడేళ్లుగా కుమార్తెపై అత్యాచారం
author img

By

Published : Sep 15, 2021, 8:42 AM IST

కూతురిపై మూడేళ్లుగా అత్యాచారానికి పాల్పడుతూ.. ఎవరికైనా చెబితే అంతుచూస్తానని భయపెట్టాడో కసాయి సవతి తండ్రి. తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. ఈ దారుణ ఘటన చాంద్రాయణగుట్ట ఠాణా పరిధిలో జరిగింది. పాతబస్తీ బండ్లగూడలోని గౌస్‌నగర్‌ ప్రాంతానికి చెందిన మహిళకు కూతురు(14), ఇద్దరు కుమారులు. భర్త నుంచి విడాకులు తీసుకుని ఒంటరిగా ఉన్న మహిళ 2017లో అంబర్‌పేటకు చెందిన వ్యాపారి (45)ని రెండో పెళ్లి చేసుకుంది.

అతనికి అప్పటికే వివాహం కాగా భార్యతో అంబర్‌పేటలో ఉంటున్నాడు. అప్పుడప్పుడూ గౌస్‌నగర్‌లోని రెండో భార్య వద్దకు వచ్చి వెళ్తుండే వాడు. ఈ క్రమంలో మూడేళ్ల క్రితం కూతురును భయపెట్టి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఎవరికీ చెప్పొద్దని... చెప్తే అంతుచూస్తానని బెదిరించేవాడు. ఈ విషయాన్ని తల్లితో చెప్పలేక... బాలిక తనలో తానే కుమిలిపోయింది. కానీ ఈనెల 13వ తేదీన ఆ మృగం తన కూతురుకు చేస్తున్న దుశ్చర్యను కళ్లారా చూసింది. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసి, నిందితుడిని మంగళవారం అరెస్టు చేసినట్లు ఎస్సై కె.గోవర్ధన్‌రెడ్డి తెలిపారు.

ఇదీ చూడండి: అమానుషం: ఏడాదిన్నర కాలంగా కన్నకూతురుపైనే అత్యాచారం

Rape case: గుంటూరు అత్యాచారం కేసు.. పోలీసుల అదుపులో ఏడుగురు!

Saidabad incident: ఇంకా దొరకని కామాంధుడు.. కారణం అదే.. ఇవిగో సీసీటీవీ దృశ్యాలు..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.