ETV Bharat / crime

కబడ్డీ పోటీల్లో అపశ్రుతి.. 150 నుంచి 200 మంది వరకు గాయాలు - suryapet news

సూర్యాపేట జిల్లాలో 47వ జాతీయ జూనియర్‌ కబడ్డీ క్రీడల ప్రారంభోత్సవంలో అపశ్రుతి చోటుచేసుకొంది. గ్యాలరీలో సామర్థ్యానికి మించి ప్రేక్షకులు కూర్చొవడం వల్ల కూలి పోయింది. ఈ ఘటనలో సుమారు 150 నుంచి 200 మంది వరకు కాళ్లు, చేతులకు గాయాలయ్యాయి.

stage collapsed at suryapet
కబడ్డీ పోటీల్లో అపశ్రుతి.. 100 మందికి పైగా గాయాలు
author img

By

Published : Mar 22, 2021, 8:11 PM IST

Updated : Aug 10, 2022, 12:27 PM IST

సూర్యాపేటలో 47వ జాతీయ జూనియర్‌ కబడ్డీ క్రీడల ప్రారంభోత్సవంలో అపశ్రుతి చోటు చేసుకుంది. మైదానంలో ఏర్పాటు చేసిన గ్యాలరీ కుప్పకూలి సుమారు 150 నుంచి 200 మంది వరకు కాళ్లు, చేతులకు గాయాలయ్యాయి. వెంటనే పోలీసులు, 108 సిబ్బంది క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్‌ తరలించారు. ఆస్పత్రులో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించిన మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్యేలు లింగయ్య, సైదిరెడ్డి పరామర్శించారు.

ప్రమాద సమయంలో గ్యాలరీల్లో దాదాపు 1500 మంది ప్రేక్షకులు ఉన్నట్లు సమాచారం. సామర్థ్యానికి మించి ప్రేక్షకులు గ్యాలరీలో కూర్చోవడంతోనే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ పోటీల్లో పాల్గొనేందుకు దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాల నుంచి క్రీడాకారులు తరలివచ్చారు. గ్యాలరీ కూలిపోవడానికి నిర్మాణంలో లోపమా? మరేదైనా కారణమా? అన్నది తేలాల్సి ఉంది.

ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించాలని భావించినా..

ఈ గ్యాలరీల ఏర్పాటుకు 90 టన్నుల ఇనుము, 60 టన్నుల కలపను వినియోగించారు. అలాగే, 20అడుగుల ఎత్తు, 240 అడుగుల వెడల్పుతో మూడు గ్యాలరీలు ఏర్పాటు చేశారు. ఒక్కో గ్యాలరీలో 5000 మంది కూర్చొనేలా మొత్తం 15వేల సామర్థ్యంతో మూడు గ్యాలరీలు నిర్మించారు. వీటికి వినియోగించిన ఇనుపరాడ్లు కొందరి కాళ్లపై పడటంతో తీవ్ర గాయాలైనట్టు సమాచారం. జాతీయ స్థాయి జూనియర్‌ కబడ్డీ పోటీలు ఇప్పటివరకు ఎన్నడూ నల్గొండ ఉమ్మడి జిల్లాలో జరగలేదు. దీంతో ఈ పోటీలను అత్యంత ప్రతిష్ఠాత్మంగా నిర్వహించాలని భావించారు. ఈ క్రీడా పోటీల కోసం పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించారు. అయితే, ఎంత భారీ ఏర్పాట్లు చేసినప్పటికీ క్రీడా పోటీలు మరికాసేపట్లో ఘనంగా ప్రారంభం కానున్న సమయంలోనే ఈ ఘటన చోటుచేసుకోవడం విషాదం నింపింది.

ఇవీచూడండి: నాంపల్లిలో అగ్ని ప్రమాదం.. దుకాణాలు దగ్ధం

Last Updated : Aug 10, 2022, 12:27 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.