ETV Bharat / crime

బయటకి వెళ్లొద్దంటే తండ్రినే అంతమొందించాడు - పెద్దపల్లి జిల్లాలో హత్య

కుమారున్ని మందలించడమే ఆ తండ్రికి శాపమైంది. బయటికి వెళ్లొద్దని చెప్పడమే అతని పాలిట మరణ శాసనమైంది. తండ్రి వారించాడన్న కోపంతో హతమార్చాడు ఓ కసాయి కొడుకు. ఈ ఘటన పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం అబ్బాపూర్ గ్రామంలో చోటు చేసుకుంది.

Son murdered his father in peddaplli district
కన్నతండ్రిని హతమార్చిన కుమారుడు
author img

By

Published : May 8, 2021, 8:00 PM IST

పెద్దపల్లి జిల్లాలో దారుణం జరిగింది. కన్న తండ్రి మందలించాడన్న కోపంతో రోకలిబండతో కొట్టి హతమార్చాడు ఓ కసాయి కుమారుడు. జూలపల్లి మండలం అబ్బాపూర్ గ్రామంలో ఈ ఘటన జరిగింది.

గ్రామానికి చెందిన కత్తెర్ల మహేశ్ డిగ్రీ వరకు చదువుకున్నాడు. కరోనా విజృంభిస్తున్న తరుణంలో బయట తిరగవద్దని తండ్రి లచ్చయ్య వారించాడు. దీంతో తండ్రిపై కోపం పెంచుకున్న మహేశ్ రాత్రి నిద్రిస్తున్న సమయంలో ఇంట్లో ఉన్న రోకలిబండతో తలపై కొట్టడంతో తీవ్ర రక్తస్రావమైంది. అతన్ని వెంటనే స్థానికులు ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందాడు. మృతుడి భార్య లలిత ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు... శవ పరీక్ష కోసం మృతదేహాన్ని సుల్తానాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నట్లు సీఐ ఇంద్రసేనారెడ్డి తెలిపారు.

ఇదీ చూడండి: గోల్కొండ ఏరియా ఆస్పత్రిని సందర్శించిన సీఎస్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.