ETV Bharat / crime

Son killed mother: పింఛను పైసల కోసం కన్న తల్లినే కిరాతంగా చంపేశాడు - son killed mother for pension

తల్లిని హత్య చేసిన తనయుడు
తల్లిని హత్య చేసిన తనయుడు
author img

By

Published : Sep 25, 2021, 10:38 AM IST

Updated : Sep 25, 2021, 11:38 AM IST

10:36 September 25

Son killed mother : పింఛను డబ్బు కోసం తల్లిని హత్య చేసిన తనయుడు

వికారాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. తల్లిని కన్నకొడుకే అతికిరాతకంగా హత్య చేశాడు. పరిగి మండలం ఖుదావాన్​పూర్​కు చెందిన బలవంత్ తన తల్లి భీమమ్మ(62)ను విద్యుత్ తీగతో గొంతు నులిమి హతమార్చాడు. 

కొన్నేళ్లుగా మద్యానికి బానిసైన బలవంత్​ విచక్షణ కోల్పోయి ప్రవర్తించేవాడని గ్రామస్థులు తెలిపారు. పెళ్లి చేస్తే అయినా బాగుపడతాడని తల్లి పెళ్లి చేసిందని.. కానీ తాగి వచ్చి భార్యను వేధించడంతో ఆమె తన ఇద్దరు పిల్లలను తీసుకుని పుట్టింటికి వెళ్లినట్లు చెప్పారు. తర్వాత తల్లితో ఉంటున్న బలవంత్.. రైతు బంధు, పింఛను డబ్బు కోసం ఆమెను వేధించేవాడని అన్నారు. 

శుక్రవారం రోజున భీమమ్మకు రూ.2వేలు పింఛన్ రావడంతో ఆమె నుంచి వేయి రూపాయలు లాక్కున్నాడని.. మిగతా వేయి రూపాయల కోసం రాత్రి హత్య చేసి ఉంటాడని స్థానికులు అనుమానిస్తున్నారు. 

స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. నిందితుణ్ని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. స్థానికులను ఆరా తీయగా.. పింఛను డబ్బు కోసమే నిందితుడు ఈ దారుణానికి ఒడిగట్టాడని చెప్పారని తెలిపారు.  

Last Updated : Sep 25, 2021, 11:38 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.