ETV Bharat / crime

మద్యం మత్తులో తండ్రిని చంపిన కుమారుడు - సూర్యాపేట జిల్లా తాజా వార్తలు

సూర్యాపేట జిల్లా నూతనకల్​ మండలంలో దారుణం చోటుచేసుకుంది. వృద్ధాప్యంలో తండ్రికి ఆసరాగా నిలవాల్సిన కుమారుడే... ఆయనను హతమార్చాడు. మద్యం మత్తులో క్షణికావేశంలో తండ్రిపై కర్రతో దాడి చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

son killed his father under the influence of alcohol in suryapet district
తండ్రిని చంపిన తనయుడు, సూర్యాపేట జిల్లా వార్తలు
author img

By

Published : Apr 21, 2021, 7:01 AM IST

మద్యం మత్తులో ఓ వ్యక్తి తన తండ్రిపై దాడి చేసి హతమార్చిన ఘటన... సూర్యాపేట జిల్లా నూతనకల్​లో చోటుచేసుకుంది. మండలం పరిధిలోని లింగంపల్లి గ్రామానికి చెందిన ఉప్పుల వెంకటయ్య(60), ఆయన కుమారుడు మల్లయ్యకు మధ్య సోమవారం రాత్రి గొడవ జరిగింది. మద్యం మత్తులో మల్లయ్య తన తండ్రి తలపై కర్రతో కొట్టడంతో స్పృహ కోల్పోయాడు.

వెంటనే స్థానిక ఆర్​ఎంపీ వైద్యుని వద్ద ప్రథమ చికిత్స చేయించారు. ఆ రోజు రాత్రి నిద్రపోయిన వెంకటయ్య మరుసటి రోజు ఉదయం లేచి చూసే సరికి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం తుంగతుర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు చెప్పారు. మృతుని భార్య నీలమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

ఇదీ చదవండి: సీతారాముల ఆశీస్సులు రాష్ట్ర ప్రజలకు ఉండాలి: సీఎం కేసీఆర్‌

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.