Son commits suicide: అల్లారు ముద్దుగా పెంచిన తల్లి తన కళ్ల ముందు విగతజీవిలా పడి ఉంటే ఆ కుమారుడి హృదయం తట్టుకోలేకపోయింది. ఆ తల్లిని తలచుకుంటూ.. ఆమె జ్ఞాపకాలు గుర్తుచేసుకుంటూ.. గుండెలవిసేలా రోదించాడు. చివరకు తల్లీ నువ్వు లేకపోతే ఈ లోకం నాకు చీకటిగా ఉందంటూ... తల్లికి దహన సంస్కారాలు చేసిన స్మశాన వాటికలోనే ఆత్మహత్య చేసుకున్నాడు.
తల్లి చనిపోవడంతో మనస్తాపం చెందిన ఓ యువకుడు.. తన తల్లికి దహన సంస్కారాలు పూర్తిచేసిన అదే స్మశాన వాటికలో ఆత్మహత్య చేసుకున్న ఘటన హైదరాబాద్‌లోని కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
గోల్నాక శ్యామ్‌నగర్‌లో నివాసం ఉండే నాగేందర్, లక్ష్మిబాయి (60) దంపతులకు ఇద్దరు కుమారులు. పిల్లల చిన్నతనంలోనే నాగేందర్ మరణించారు. లక్ష్మిబాయి కూలీ పనులకు వెళ్లి, ఇళ్లలో పాచిపనులు చేసి కుమారులు వినోద్‌కుమార్(36), విజయ్‌కుమార్‌లను పెంచి పెద్దచేసింది. వినోద్‌కుమార్ అవివాహితుడు. ఆటో డ్రైవర్‌గా పనిచేసేవాడు. క్యాన్సర్‌తో లక్ష్మిబాయి చనిపోగా బుధవారం గోల్నాక హర్రాస్‌పెంట హిందూ శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించారు.
తల్లి ప్రేమను మరచిపోలేక..
తల్లి ప్రేమ, మమకారాలను మరచిపోలేని వినోద్‌కుమార్ అంత్యక్రియల తర్వాత ఇంటికి వచ్చి ఎవరికీ చెప్పకుండానే బయటకు వెళ్లిపోయాడు. శ్మశానవాటికలోని షెడ్డులో ఉరేసుకుని చనిపోయిన ఆయనను గురువారం ఉదయం స్థానికులు గుర్తించి పోలీసులకు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి: