ETV Bharat / crime

son attack on father: కన్నతండ్రిపై కత్తితో దాడి... కారణం అదేనా..?

మద్యానికి మానిసైన ఓ వ్యక్తి.. కన్నతండ్రిపై కత్తి దూశాడు. మద్యం తాగొద్దని మందలించాడని కత్తితో దాడి చేశాడు. ఈఘటన సనత్​నగర్​ పరిధి ఫతేనగర్​ డివిజన్​ శివశంకర్​ నగర్​లో జరిగింది.

son attak
son attak
author img

By

Published : Oct 27, 2021, 4:17 PM IST

హైదరాబాద్ సనత్‌నగర్ ఠాణా పరిధిలో దారుణం జరిగింది. మద్యానికి బానిసైన ఓ వ్యక్తి.. మద్యం మత్తులో కన్న తండ్రిపై కత్తితో దాడి చేశాడు. మద్యం తాగొద్దని మందలించాడనే కోపంతో హత్యాయత్నానికి పాల్పడ్డాడు.

సనత్‌నగర్ పరిధి ఫతేనగర్‌ డివిజన్ శివశంకర్​నగర్‌కు చెందిన కిరణ్​ (38) మద్యానికి బానిసయ్యాడు. కొంతకాలంగా ఏపనికి వెళ్లకుండా తిరుగుతున్నాడు. 12ఏళ్ల క్రితం వివాహమైన కిరణ్​కు ఇద్దరు పిల్లలున్నారు. కిరణ్​ తీరుతో విసుగుచెందిన అతని భార్య 2019లో విడిచిపెట్టి వెళ్లిపోయింది. అయినప్పటికీ అతని తీరులో మార్పురాలేదు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి ఇంటికి వచ్చిన కిరణ్​ను అతడి తండ్రి అశోక్​ మందలించాడు.

మాటామాటా పెరిగి... కిరణ్ కత్తితో తండ్రి మెడపై వేటు వేశాడు. కుటుంబ సభ్యులు వెంటనే 108కు ఫోన్​ చేసి.. అశోక్​ను ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం అశోక్​ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని పోలీసులు తెలిపారు.

కుమారుడి దాడిలో గాయపడిన అశోక్​
కుమారుడి దాడిలో గాయపడిన అశోక్​

ఇదీ చూడండి: Facebook friendship: ఫేస్​బుక్​ పరిచయం ప్రేమగా మారింది.. యువకుడి ప్రాణం మీదకు తెచ్చింది.!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.