ETV Bharat / crime

వెండర్ల ఇష్టారాజ్యం: రూ.20 స్టాంపు పేపర్​కు ఏకంగా రూ.100 వసూలు..! - సూర్యాపేటలో నాన్‌ జ్యుడిషియల్‌ స్టాంపు పేపర్లు

మనం సాధారణంగా ఏదైనా భూమి కొనుగోలు ఒప్పంద పత్రాన్ని పొందాలన్నా, భూమిని రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాలన్నా స్టాంపు పేపర్లతో అవసరం ఉంటుంది. వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో, విద్యార్థుల ఉపకార వేతనాలు, హామీ పత్రాలు మొదలగు వాటికి వీటిని వినియోగిస్తారు. ఈ క్రమంలోనే కొంత మంది స్టాంపు వెండర్లు అక్రమ వసూళ్లకు తెర తీశారు. రూ.20 స్టాంపు పేపరుకు రూ.100 వసూలు చేస్తుండటం గమనార్హం. ఇదేంటని ప్రశ్నిస్తే కొరత ఉందంటూ సమాధానం చెబుతున్నారు. ఈ అక్రమ వసూళ్లకు ఎంతకీ అడ్డుకట్ట పడటం లేదు.

Some Stamp Vendors Are Making Illegal Collections

author img

By

Published : Dec 27, 2022, 9:39 AM IST

సూర్యాపేటలో రూ.20 స్టాంపు పేపరు కొనుగోలు చేయాలంటే అదనంగా రూ.10 చెల్లించాల్సిందే. రూ.100 స్టాంపు పేపరుకు రూ.20 ఎక్కువగా ముట్టజెప్పాలి. బ్యాంకు నుంచి రుణాలు పొందే క్రమంలో అవసరమైన ఫ్రాంక్లిన్‌ చేయించుకోవాలంటే సూర్యాపేట సబ్‌రిజిస్ట్రేషన్‌ కార్యాలయంలో ఆ మొత్తానికి అదనంగా 10 శాతం సమర్పించుకోవాలి.

జిల్లా కేంద్రంలోని ఆర్టీఏ కార్యాలయం సమీపంలో రూ.20 స్టాంపు పేపరుకు కొంత మంది రూ.100 వసూలు చేస్తుండటం గమనార్హం. ఇదేంటని ప్రశ్నిస్తే కొరత ఉందంటూ సమాధానం చెబుతున్నారు. ఈ అక్రమ వసూళ్లకు ఎంతకీ అడ్డుకట్ట పడటం లేదు. సూర్యాపేటలో నాన్‌ జ్యుడిషియల్‌ స్టాంపు పేపర్లు కొనుగోలు వ్యవహారంలో అక్రమాలు సర్వసాధారణంగా మారాయి. వీటిని కొనుగోలు చేయాలంటే అదనంగా చెల్లించాల్సి వస్తోంది.

కొన్నేళ్లుగా వీటి విక్రయాల విషయంలో ఎన్ని ఫిర్యాదులు అందినా పట్టించుకునే నాథుడే కరవయ్యారు. సాధారణంగా ఏదైనా భూమి కొనుగోలు ఒప్పంద పత్రాన్ని పొందాలన్నా, భూమిని రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాలన్నా స్టాంపు పేపర్ల అవసరం ఉంటుంది. వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో, విద్యార్థుల ఉపకార వేతనాలు, హామీ పత్రాలకు వీటిని వినియోగిస్తారు. జిల్లా కేంద్రంలోని కొంత మంది స్టాంపు వెండర్లు అక్రమ వసూళ్లకు తెర తీశారు.

తమ పరపతితో స్టాంపు పేపర్లను పెద్ద మొత్తంలో కొనుగోలు చేసి కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు. వీటి కోసం సబ్‌ రిజిస్ట్రేషన్‌ శాఖ కార్యాలయంలోనూ ఒక కౌంటర్‌ను ఏర్పాటు చేయాల్సి ఉన్నా సిబ్బంది కొరత పేరుతో ప్రభుత్వం నుంచి వస్తున్న స్టాంపు పేపర్లను వెండర్లకే అందిస్తున్నారు. ఈ విషయమై ఉన్నతాధికారులకు వినియోగదారులు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.

కృత్రిమ కొరత బూచి: జిల్లా వ్యాప్తంగా 35 మంది అనుమతి పొందిన స్టాంపు వెండర్లు ఉన్నారు. ప్రభుత్వం నుంచి విడుదలైన పేపర్లను రిజిస్ట్రేషన్‌ శాఖ అధికారులు అనుమతి పొందిన వెండర్లకు పంపిణీ చేస్తారు. వారు ఆ నిర్దేశిత ధరకు విక్రయించాలి. కానీ, కృత్రిమ కొరత సృష్టించి అధిక ధరలకు అమ్ముతున్నారు. ప్రభుత్వం స్టాంపు పేపర్లపై విక్రయంపై కొంత కమీషన్‌ ఇస్తున్నా.. అది సరిపోక అదనపు ఆదాయానికి అలవాటు పడుతున్నారు. అధిక ధరలకు విక్రయిస్తే రిజిస్ట్రేషన్‌ శాఖ అధికారులకు వెండర్ల లైసెన్సును రద్దు చేసే అధికారం ఉంది. కానీ, వారు పట్టించుకోకపోవడంతో వెండర్లు ఇష్టానుసారంగా ధరలు పెంచేసి లాభాలు గడిస్తున్నారు.

అదనపు వసూళ్లు: బ్యాంకు నుంచి రుణాలు పొందాలంటే నిబంధనల ప్రకారం ఎక్కువ మొత్తంలో నాన్‌జ్యుడిషియల్‌ స్టాంపు రుసుం చెల్లించాలి. ఇందుకోసం సబ్‌ రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల్లో ఫ్రాంక్లిన్‌ యంత్రాలను ఉపయోగిస్తుంటారు. తక్కువ మొత్తంలో కావాలంటే టి-యాప్‌ వినియోగిస్తుంటారు. ఫ్రాంక్లిన్‌ చలానా చెల్లించిన వినియోగదారుల నుంచి సూర్యాపేట కార్యాలయంలోని ఓ ఉద్యోగి పది శాతం అదనంగా వసూలు చేస్తున్నాడు. టి-యాప్‌లో టికెట్లు కొనుగోలు చేయాలన్నా వినియోగదారులకు అదనపు వసూళ్లు తప్పడం లేదు.

విచారించి చర్యలు తీసుకుంటాం: స్టాంపు పేపర్లను అధిక ధరకు విక్రయిస్తున్న విషయం ఇప్పటి వరకు నా దృష్టికి రాలేదు. స్టాంపు వెండర్లు ప్రభుత్వం నిర్దేశించిన ధరలకే విక్రయించాలి. నిబంధనలను అతిక్రమించి అధిక ధరలకు విక్రయించిన వారి లైసెన్స్‌ రద్దు చేస్తాం. రిజిస్టేషన్‌ కార్యాలయంలోనూ సిబ్బంది డబ్బుల వసూలు విషయంపై విచారించి చర్యలు తీసుకుంటాం. -బలరాం, సబ్‌రిజిస్ట్రార్‌, సూర్యాపేట

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.