Soil lorry rushed to the houses: వరంగల్ జిల్లా సంగెం కాపులకనపర్తి గ్రామంలో మట్టి లారీ బీభత్సం సృష్టించింది. విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టి పక్కనే ఉన్న ఇళ్లపైకి దూసుకెళ్లింది. ఆ సమయంలో ఇళ్లలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టినప్పుడు కరెంటు వైర్లు తెగిఉంటే భారీ అగ్ని ప్రమాదమే జరిగి ఆస్తి నష్టం వాటిల్లేదని స్థానికులు పేర్కొన్నారు. ఒకవేళ ఇళ్లలో మనుషులు ఉంటే జరిగే ఘోరం అంతా ఇంతా కాదు. ఆ సమయంలో పరిసర ప్రాంతాల్లో ఎవరూ లేకపోవడంతో పెద్ద గండం నుంచి బయటపడినట్లైంది.
అనుమతులు లేని నల్లమట్టిని తరలిస్తూ ఇలా ప్రమాదాలకు కారణమవుతున్నట్లు స్థానికులు ఆరోపించారు. లారీల అతి ప్రవర్తన వల్ల నిత్యం ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయన్నారు. అక్రమ మట్టి రవాణాకు పాల్పడుతూ ప్రమాదాలకు కారణమైన వారి పట్ల అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: యాదాద్రీశుని దర్శనాలు పున:ప్రారంభం.. భారీగా తరలివస్తోన్న భక్తులు