ఏపీలోని ప్రకాశం జిల్లా పెద్దచర్లపల్లి మండలం మూలవారిపల్లి గ్రామానికి చెందిన మహదేవరెడ్డికి (35), సూర్యాపేట జిల్లా కోదాడ మండల రామలక్ష్మీపురానికి చెందిన స్వప్నతో ఐదేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరిద్దరు మహారాష్ట్రలోని పుణెలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నారు. వీరివురికీ నెలకు రూ .2.5 లక్షల జీతం వస్తోంది. కరోనా నేపథ్యంలో 2020 డిసెంబర్లో సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం ఇస్నాపూర్‌లో ఇల్లు అద్దెకు తీసుకుని ఇంటి నుంచే పని చేస్తున్నారు.
భార్యజీతాన్ని అంతా నెలాఖరున భర్త మహదేవరెడ్డి చేతికే ఇచ్చేది. అతను వచ్చిన డబ్బుతో షేర్లలో పెట్టుబడి పెట్టాడు. షేర్లు ఉన్నటుండి పడిపోవటంతో తీవ్రంగా నష్టపోయి అప్పుల పాలయ్యాడు. తనలోనే మదనపుడుతూ ఉండేవాడు. ఫిబ్రవరిలో భర్తను ఎందుకు ఇలా ఉంటున్నారని స్వప్న నిలదీయగా షేర్లలో పెట్టడంతో అప్పులుపాలయ్యానని చెప్పాడు. ఆమెకున్న బంగారం అమ్మి రూ. 20 లక్షలు భర్తకు ఇచ్చింది. ఇంకా రూ. 60 లక్షలు అప్పులు ఉన్నాయని చెప్పాడు భర్త. మిగతా అప్పులు త్వరలో తీరుద్దామని చెప్పింది స్వప్న. ఉన్నట్టుండి ఆదివారం ఉదయం ఇంట్లో కిటికీకి లుంగీతో ఉరేసుకుని బలవన్మరణానికి(Suicide) పాల్పడ్డాడు మహదేవరెడ్డి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
ఇదీ చదవండి: Telangana Cabinet: ఎల్లుండి రాష్ట్ర మంత్రివర్గ సమావేశం