ETV Bharat / crime

బాలికపై సాఫ్ట్​వేర్​ ఉద్యోగి అత్యాచారం.. - బాలికపై అత్యాచారం వార్తలు

అతనో సాఫ్ట్​వేర్​ ఉద్యోగి.. ఖాళీ సమయాల్లో పార్ట్​ టైం జాబ్​ లాగా ట్యూషన్లు చెబుతున్నాడు. ఈ క్రమంలో ఓ ఇంటర్​ విద్యార్థిని అతని ఇంటికి ట్యూషన్​కు వచ్చింది. కొన్ని రోజులు సాఫీగానే సబ్జెక్టులో సందేహాలు తీర్చాడు. ఇంతలో ఏమైందో.. అతని బుద్ధి వక్రించింది. ఆ విద్యార్థినిపై అత్యాచారానికి ఒడిగట్టాడు. చివరకు పోలీసులకు చిక్కి ఊచలు లెక్కపెడుతున్నాడు. బంజారాహిల్స్​లో ఈ ఘటన చోటు చేసుకుంది.

software employ committed rape on inter student girl
బాలికపై సాఫ్ట్​వేర్​ ఉద్యోగి అత్యాచారం
author img

By

Published : Jan 24, 2021, 1:43 PM IST

మైనర్ బాలికను కిడ్నాప్ చేసి గదిలో బంధించి అత్యాచారానికి పాల్పడిన సాఫ్ట్​వేర్ ఇంజనీర్​ను బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్​కు తరలించారు. ఆంధ్రప్రదేశ్​లోని విజయవాడకు చెందిన కంటె నరేష్(37) సాఫ్ట్​వేర్ ఇంజనీర్​గా పనిచేస్తూ హైదరాబాద్​ బంజారాహిల్స్ రోడ్ నం. 2 లోని ఇందిరానగర్​లో నివసిస్తున్నాడు. ఇతనికి భార్య, ముగ్గురు పిల్లలు. సమీపంలో నివసిస్తున్న ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న మైనర్‌ విద్యార్థినికి గత కొంత కాలంగా ట్యూషన్ చెబుతున్నాడు. ఈ క్రమంలోనే వీరిద్దరి మధ్య సాన్నిహిత్యం ఏర్పడింది.

గది అద్దెకు తీసుకుని

ఈ నెల 21న ఆ బాలికకు మాయ మాటలు చెప్పి లొంగదీసుకునేందుకు నరేష్​ యత్నించగా అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో అదే రోజు రాత్రి విద్యార్థినిని బలవంతంగా తీసుకెళ్లి అప్పటికే అద్దెకు తీసుకున్న ఓ గదిలో బంధించాడు. నైట్ డ్యూటీకి వెళ్తున్నానని భార్యకు చెప్పి ఆపై అత్యాచారానికి పాల్పడ్డట్లుగా బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్​కు తరలించారు.

ఇదీ చదవండి: గోడౌన్​లో భారీ మొత్తంలో గుట్కా స్వాధీనం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.