నిజామాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. మంత్రాల నెపంతో మతిస్థిమితంలేని వ్యక్తిని కొట్టి చంపారు(crime news telugu). మానసిక పరిస్థితి సరిగా లేని ఓ వ్యక్తి రాత్రి రోడ్డుపై వెళ్తుంటే మంత్రాలు చేస్తున్నాడనే అనుమానంతో ఆరుగురు వ్యక్తులు కలిసి హత్య చేశారు(Murder case news).
బోధన్‌కు చెందిన చిన్న గంగారాం ఈనెల 1న తప్పిపోయాడని పోలీసు స్టేషన్లో మిస్సింగ్ కేసు నమోదైంది. ఈనెల 2న నవీపేట్ మండలం ఫతేనగర్‌లో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. ఆ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించగా... నివేదికలో హత్యగా తేలింది. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టారు.
రెంజల్ మండలం కిసాన్ తండాకు చెందిన ఆరుగురు వ్యక్తులు ఈనెల 1న రాత్రి రోడ్డుపై వెళ్తున్న వ్యక్తిని కర్రలు, రాడ్లతో కొట్టి చంపినట్లు పోలీసులు గుర్తించారు. అనంతరం మృతదేహాన్ని బైక్‌పై తీసుకెళ్లి ఫతేనగర్ శివారులో పడేశామని... మంత్రాలు చేస్తున్నాడనే అనుమానంతో చంపామని నిందితులు చెప్పినట్లు వెల్లడించారు. నిందితుల్లో కిసాన్ తండాకు చెందిన జీవన్, విక్రమ్, రాఠోడ్ రాజులతో పాటు ముగ్గురు మైనర్లు కూడా ఉన్నారని సీఐ పేర్కొన్నారు. వారందరినీ శుక్రవారం అరెస్టు చేసి రిమాండ్‌కు పంపామని తెలిపారు.
ఇదీ చదవండి: Young girl rape in Mahbubnagar: యువతిపై అత్యాచారం.. ఆపై వీడియో తీసి!