six militia members arrested : ములుగు జిల్లాలో ఆరుగురు మిలీషియా సభ్యులను అరెస్టు చేసినట్లు ములుగు ఓఎస్టీ శోభన్ కుమార్ తెలిపారు. తిప్పాపురం, పెద్దఉట్లపల్లి అటవీప్రాంతంలో పేలుడు పదార్థాలను అమరుస్తుండగా అదుపులోకి తీసుకున్నామని వెల్లడించారు. వారి నుంచి రెండు టిఫిన్ బాక్సులు, డిటోనేటర్లు, తీగలు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.
తెలంగాణ-ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతాలైన వెంకటాపురం మండలంలోని తిప్పాపురం, పెద్దఉట్లపల్లి గ్రామాల మధ్య మిలీషియా సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు. మావోయిస్టులు పేలుడు పదార్థాలను అమర్చుతుండగా... స్పెషల్ పార్టీ పోలీసులు గురువారం అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. అటువైపుగా కూంబింగ్ చేస్తూ వెళ్తుండగా... మందుపాతరలను అమర్చుతున్న మిలీషియా సభ్యులు చూసి వెంబడించి... అదుపులోకి తీసుకున్నట్లు వివరించారు.
ఘటనా స్థలంలో రెండు టిఫిన్ బాక్సులు, కార్డ్ ఎక్స్ వైర్, రెండు డిటోనేటర్లను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. అదుపులోకి తీసుకున్న ఆరుగురు మిలీషియా సభ్యులపై కేసు నమోదు చేసి... రిమాండ్కు తరలించినట్లు ఓఎసీడి శోభన్ కుమార్ వెల్లడించారు.
'తెలంగాణ-ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లోని మిలీషియా సభ్యులు పేలుడు పదార్థాలు అమర్చుతున్నారు. పక్కా సమాచారంతో స్పెషల్ పార్టీలతో కూంబింగ్ నిర్వహించాం. ఈనెల 30న మధ్యాహ్నం తిప్పాపురం, పెద్దఉట్లపల్లి బాటలో టిఫిన్ బాంబులు పట్టుకొని కనిపించారు. వారిని చేజింగ్ చేసి పట్టుకున్నాం. వారి దగ్గర రెండు టిఫిన్ బాక్సులు, డిటోనేటర్లు, వైర్లు స్వాధీనం చేసుకున్నారు. వారంతా మిలీషియాలో పనిచేస్తున్నట్లు అంగీకరించారు. గురువారం అరెస్ట్ చేశాం. శుక్రవారం కోర్టులో హాజరుపరిచాం.'
-శోభన్ కుమార్, ములుగు ఓఎస్డీ
ఇదీ చదవండి: Judgment on rape case: కుమార్తెపై అత్యాచారం.. తండ్రికి కఠిన శిక్ష ఖరారు..