ETV Bharat / crime

వీడియో వైరల్: సింగిల్ విండో ఛైర్మన్ లంచం డిమాండ్ - డబ్బులు డిమాండ్

విత్తనాలు తరలించే ట్రాక్టర్​ నుంచి.. ఓ సింగిల్ విండో ఛైర్మన్ రూ.లక్ష మామూళ్లను డిమాండ్ చేశారు. వాహనాన్ని అడ్డుకుని.. డబ్బులిచ్చే వరకు కదిలేది లేదంటూ నానా హంగామా సృష్టించారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో ఇప్పుడు చక్కర్లు కొడుతున్నాయి.

Bribery case
లంచం డిమాండ్
author img

By

Published : May 31, 2021, 8:49 PM IST

కరీంనగర్ జిల్లా కేశవపట్నం మండలం తాడికల్ సింగిల్ విండో ఛైర్మన్.. రహదారిపై వెళ్తున్న ఓ సీడ్ కంపెనీ వాహనాలను అడ్డుకున్నారు. ప్రతి టాక్టర్​కు రూ.లక్ష మామూళ్లను ఇచ్చేవరకు అక్కడి నుంచి కదిలేది లేదంటూ డిమాండ్ చేశారు. వారిని తీవ్ర పదజాలంతో దూషిస్తూ.. నానా హంగామా సృష్టించారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు.. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్​గా మారాయి.

ఆలస్యంగా వెలుగులోకి..

కేశవపట్నం మండలంలోని సదరు సీడ్ కంపెనీ విత్తనాలను.. తిమ్మాపూర్ మండలం మొగిలిపాలెం గోదాంలోకి తరలిస్తున్నారు. ఈ క్రమంలో మొగిలిపాలెం సమీపంలోకి వచ్చిన వాహనాలను.. ఛైర్మన్, మరో డైరెక్టర్​తో కలిసి అడ్డుకున్నారు. డబ్బు డిమాండ్ చేస్తూ వారితో గొడవకు దిగారు. ఈ తతంగాన్ని వీడియో తీసిన వారిపై కూడా ఛైర్మన్​ దాడి చేసినట్లుగా స్థానికంగా ప్రచారం జరుగుతోంది. ఈ ఘటన ఐదు రోజుల క్రితం జరిగినట్లుగా తెలుస్తోంది.

ఇంకేమైనా కావాలా అని అడిగారు..!

ఓ సింగిల్ విండో ఛైర్మన్​కు సీడ్ కంపెనీలకు సంబంధం లేకున్నా.. డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేయడమేంటని స్థానికులు మండిపడుతున్నారు. అదీకాక.. ఛైర్మన్​ పరిధిలోకి రాని మొగిలిపాలెం వద్ద వాహనాలను అడ్డుకోవడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరో వైపు తాను కాగితాలు చూపమని అడిగితే.. వారే ఇంకేమైనా కావాలా అని అడిగారని, అందుకే తాను డబ్బు డిమాండ్ చేసినట్లు​ ఛైర్మన్ వివరణ ఇచ్చుకోవడం కొసమెరుపు.

ముచ్చటొద్దు.. లక్ష కావాలి.

ఇదీ చదవండి: Accident: బైక్​ను ఢీకొన్న లారీ.. యువకుడు మృతి

తెలంగాణ టాప్ న్యూస్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.