ETV Bharat / crime

కాలువలోకి కారును తోసేసిన అక్కాతమ్ముడు.. మానసిక రుగ్మతే కారణమా.?

Siblings Pushed Car in Canal: నల్గొండ జిల్లా వేములపల్లి మండలం సాగర్ ఎడమ కాలువలో అనుమానాస్పదంగా కొట్టుకొచ్చిన కారును పోలీసులు గుర్తించారు. అక్కాతమ్ముడు కలిసే కారును నీళ్లలోకి తోసేసినట్లుగా పోలీసుల దర్యాప్తులో తేలింది. కాగా వారి మానసిక స్థితి సరిగా లేదని.. వాహనాన్ని నీళ్లలోకి ఎందుకు తోసేశారనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. గజ ఈతగాళ్ల సాయంతో కాలువలోంచి కారును వెలికితీసే చర్యలు కొనసాగుతున్నాయి.

Siblings pushed car in canal
కాలువలో కారు తోసేసిన అక్కా తమ్ముడు
author img

By

Published : Mar 19, 2022, 12:50 PM IST

Updated : Mar 19, 2022, 2:24 PM IST

Siblings Pushed Car in Canal: నల్గొండ జిల్లా వేములపల్లి వద్ద సాగర్ ఎడమ​ కాలువలో శుక్రవారం.. నీళ్లలో కొట్టుకొచ్చిన కారుకు సంబంధించిన వివరాలను పోలీసులు గుర్తించారు. ఇద్దరు వ్యక్తులు కారును కాల్వలోకి తోసి వెళ్లినట్లుగా ప్రత్యక్ష సాక్షులు వెల్లడించగా.. ఆ దిశగా వివరాలు రాబట్టారు. కారును తోసేసిన వ్యక్తులు అక్కా, తమ్ముడిగా నిర్ధరించారు. మిర్యాలగూడ అవంతిపురానికి చెందిన విఘ్నేశ్వరి, మల్లికార్జునగా తేల్చారు. వాళ్లు మానసిక ఆందోళనలో ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. అసలు కారును నీళ్లలోకి ఎందుకు.. తోశారు అనే కారణాలు రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.

Siblings pushed car in canal
విఘ్నేశ్వరి
Siblings pushed car in canal
మల్లికార్జున్​

కారు కోసం గాలింపు

కాలువలోంచి కారును వెలికితీసేందుకు పోలీసులు గజ ఈతగాళ్లను రంగంలోకి దింపారు. సాగర్ ఎడమ కాలువలో నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో వాహనాన్ని గుర్తించడం ఇబ్బందిగా మారింది. కాలువలో ప్రస్తుతం 17 అడుగుల మేర నీరు ప్రవహిస్తోంది. ప్రవాహంలో 2 కిలోమీటర్ల మేర కారు కొట్టుకుపోయే అవకాశం ఉందని గజ ఈతగాళ్లు అంచనా వేస్తున్నారు. నీటి పారుదల శాఖ అధికారుల సమన్వయంతో సాయంత్రం వరకు నీటిని తగ్గించే ప్రయత్నం చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

సాగర్‌ కాల్వలో నిన్న కారు తోసేసిన వారిని గుర్తించిన పోలీసులు

అసలేం జరిగిందంటే..

తిప్పర్తి మండల కేంద్రానికి చెందిన విశ్రాంత ఉపాధ్యాయులు రామాంజనేయులుకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. గత కొంతకాలంగా వీరి కుటుంబంలో గొడవలు జరుగుతుండటంతో.. తల్లిదండ్రులతో విభేదించి కూతురు విఘ్నేశ్వరి, కుమారుడు మల్లికార్జున్​.. మిర్యాలగూడ మండలం అవంతిపురం గ్రామంలో నివాసం ఉంటున్నారు. వారి ఖర్చులకు ప్రతి నెలా తండ్రే డబ్బులు పంపిస్తున్నారు. కుటుంబ గొడవలతో అక్కాతమ్ముడు గత కొంతకాలంగా డిప్రెషన్​తో బాధపడుతూ చర్చిల చుట్టూ తిరుగుతూ ప్రార్థనలు చేస్తున్నట్లుగా పోలీసుల దర్యాప్తులో తేలింది.

అందుకోసమే వచ్చారా.!

ఈ క్రమంలో రామాంజనేయులు రిటైర్డ్ అవ్వగా వచ్చిన డబ్బులతో ఈ మధ్యనే కారు కొనుగోలు చేశారు. కాగా రిటర్మైంట్​ డబ్బుల విషయంలోనూ కుటుంబంలో మనస్పర్థలు వచ్చాయని... దీంతో ఇప్పటికే మానసిక రుగ్మతతో ఉన్న మల్లికార్జున్, విఘ్నేశ్వరిలు ఆత్మహత్య చేసుకునే ఉద్దేశంతోనే శుక్రవారం.. కాలువ దగ్గరకు వచ్చారని పోలీసులు ప్రాథమికంగా నిర్ధరించారు. అక్కడికి వెళ్లాక కారును సాగర్ ఎడమ కాలువలో తోసి వెళ్లిపోయారని ప్రత్యక్ష సాక్షుల ద్వారా తెలిసింది.

దర్యాప్తు చేస్తుండగా

స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు.. కారు ఎవరిదనే కోణంలో దర్యాప్తు చేస్తుండగా.. కాలువలో పడ్డ కారు తమదేనంటూ అక్కాతమ్ముడు పోలీసు స్టేషన్​కు రావడంతో విషయం వెలుగులోకి వచ్చింది. వారి వద్ద నుంచి పొంతన లేని సమాధానాలు రావడం, మానసికస్థితి సరిగ్గా లేకపోవడంతో వెంటనే తల్లిదండ్రులను పిలిపించారు. వారి నుంచి వివరాలు సేకరించిన పోలీసులు.. అక్కాతమ్ముడిని వారి ఇంటికి పంపించివేశారు. కాలువలో పడిన కారును బయటకు తీసే ప్రయత్నంలో పోలీసులు ఉన్నారు.

"సాగర్​ ఎడమ కాలువలోకి శుక్రవారం ఉదయం ఇద్దరు వ్యక్తులు కారును తోసేయడాన్ని గుర్తించిన స్థానికుల సమాచారం మేరకు దర్యాప్తు చేస్తుండగా.. నిన్న సాయంత్రం అక్కాతమ్ముడు.. కారు మాదేనంటూ ఫిర్యాదు చేశారు. కారును ఎందుకు తోసేశారనే దానిపే ప్రశ్నలు అడుగుతుండగా.. పొంతన లేకుండా సమాధానం చెబుతున్నారు. వారి మానసిక స్థితి సరిగా లేదని అర్థమైంది. తల్లిదండ్రులను పిలిపించి సమాచారం సేకరించాం. నేరమేమి చేయలేదు కాబట్టి.. వారిని ప్రస్తుతం ఇంటికి పంపించాం. కారును వెలికి తీశాక దర్యాప్తు చేపడతాం." -సత్యనారాయణ, గ్రామీణ ఎస్సై

ఇదీ చదవండి: ఆంధ్రా-కర్ణాటక సరిహద్దు వద్ద బస్సు బోల్తా.. 8 మంది మృతి!

Last Updated : Mar 19, 2022, 2:24 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.