ETV Bharat / crime

యువకులపై ఎస్సై దాష్టీకం.. వీఆర్​కు పంపుతూ ఎస్పీ ఆదేశాలు - si beats young people in AP

ఏపీలోని కోనసీమ జిల్లా పప్పులవారి పాలెంలో అశ్లీల నృత్యాలు ఏర్పాటు చేశారన్న ఆరోపణలతో నలుగురు యువకులను తీవ్రంగా కొట్టిన ఎస్సైపై జిల్లా ఎస్పీ చర్యలు తీసుకున్నారు. పి. గన్నవరం ఎస్సై సురేంద్రను వీఆర్​కు పంపుతూ ఆదేశాలు జారీ చేశారు.

యువకులపై ఎస్సై దాష్టీకం.
యువకులపై ఎస్సై దాష్టీకం.
author img

By

Published : May 23, 2022, 7:57 AM IST

అమ్మవారి జాతరలో అశ్లీల నృత్య ప్రదర్శనలు ఏర్పాటు చేశారనే ఆరోపణలతో నలుగురు యువకులను తీవ్రంగా కొట్టిన కోనసీమ జిల్లా పి.గన్నవరం ఎస్సైను వీఆర్​కు పంపుతూ ఎస్పీ ఆదేశాలిచ్చారు. వివరాల్లోకి వెళితే..ఈనెల 18న పి.గన్నవరం పోలీసు స్టేషన్ పరిధిలోని పప్ఫుల వారిపాలెంలో అమ్మవారి జాతర నిర్వహించారు. జాతరలో అశ్లీల నృత్య ప్రదర్శనలు జరుగుతున్నాయన్న సమాచారం మేరకు అక్కడకు వెళ్లిన ఎస్​ఐ సురేంద్ర గ్రామానికి చెందిన పప్పుల వెంకట దుర్గా ప్రసాద్​, శ్రీను బాబు, ప్రసాద్, నవీన్​లను అదుపులోకి తీసుకున్నారు.

అశ్లీల నృత్యాలు ఏర్పాటుకు యువకులే కారణమంటూ వారిని స్టేషన్​కు తరలించి తీవ్రంగా కొట్టారు. తీవ్రంగా గాయపడ్డ యువకులు స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయంపై కాపు సామాజిక వర్గ జేఏసీ నాయకులు నిరసన వ్యక్తం చేయటంతో ఎస్సైను వీఆర్​కు పంపుతూ ఎస్పీ సుబ్బారెడ్డి ఆదేశాలు జారీ చేశారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.