వాళ్లిద్దరూ పోలీసులు. రోజు గస్తీ కాస్తు.. రోడ్డుపై ఉన్న ఓ షాపుపై బాగా నిఘా పెట్టినట్లున్నారు. పక్కాగా ప్లాన్ చేసుకోని అనుకున్న పనిని పూర్తి చేశారు. అయితే అసలు విషయం మర్చిపోయారు. అంతా బాగానే సెట్ చేసుకున్నారుగాని షాపులో సీసీటీవీ ఉన్న విషయాన్ని మాత్రం మర్చిపోయారు. ఇంకేముంది.. దొంగతనాలు జరిగినప్పుడు దొంగలను పట్టించే సీసీటీవీలే ఇప్పుడు పోలీసులను పట్టించేశాయి.
దొంగలతో కలిసి దొచుకున్న సోమ్ములో వాటలు తీసుకునే పోలీసులను చాలా సినిమాల్లోనే చూశాం. కానీ పోలీసులు దొంగ అవతారమెత్తిన సీన్ మాత్రం ఏపీలోని చిత్తూరు జిల్లాలో చూడొచ్చు. పీవీకేఎన్ కళాశాల నుంచి కలెక్టరేట్‌కు వెళ్లే మార్గంలో.. ఓ వ్యక్తి బట్టల వ్యాపారాన్ని ప్రారంభించాడు. వ్యానులో దుస్తులు ఉంచి విక్రయిస్తుంటాడు. రాత్రి దుకాణం మూసి బట్టలన్నీ మూట కట్టి తరువాత రోజు పొద్దున్నే యథావిథిగా వచ్చాడు. చూసేసరికి బట్టలు తక్కువుగా ఉండడాన్ని గుర్తించాడు.
ఎవరికీ తెలియకుండా అమర్చిన సీసీ కెమేరా ఫుటేజీ చూసేసరికి యూనిఫాంలో ఉన్న ఎస్సై మహమ్మద్, కానిస్టేబుల్ ఇంతియాజ్ బట్టలు కాజేసినట్లు గుర్తించాడు. ఆ ఫుటేజీని పోలీసులకు ఇచ్చి ఫిర్యాదు చేశాడు. ఈ సంఘటనపై స్పందించిన ఎస్పీ సెంథిల్‌కుమార్.. వస్త్రాల చోరీకి పాల్పడిన ఎస్సై మహమ్మద్, కానిస్టేబుల్ ఇంతియాజ్‌ను అరెస్ట్ చేశారు. విధుల నుంచి తొలగిస్తూ ఆదేశాలు ఇచ్చారు.
ఇదీ చదవండి: