ETV Bharat / crime

విద్యార్థినులను లైంగికంగా వేధించారు... ఇంటిదారి పట్టారు... - ఏపీ తాజా సమాచారం

ఏపీలోని సత్యసాయి జిల్లాలో ఓ జూనియర్ కళాశాలలో విద్యార్థినులను లైంగికంగా వేధించిన అధ్యాపకులపై వేటు పడింది. కీచక లెక్చరర్లపై "ఈటీవీ" ప్రసారం చేసిన కథనానికి స్పందించిన ఉన్నతాధికారులు.. దోషులుగా తేలిన వారిపై కఠిన చర్యలు తీసుకున్నారు.

Talupula junior college
Talupula junior college
author img

By

Published : Apr 23, 2022, 7:51 AM IST

కళాశాల విద్యార్థినులను లైంగికంగా వేధించిన కీచక అధ్యాపకులందరినీ ఉద్యోగాల నుంచి తొలగిస్తూ ఉన్నతాధికారులు ఆదేశాలిచ్చారు. ఈ ఘటన ఏపీలోని సత్యసాయి జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని తలుపుల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇద్దరు అధ్యాపకులు తమపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని కొంతకాలంగా విద్యార్థినులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. ఎవరికీ చెప్పులేక కుమిలిపోతున్నారు. ఈ నేపథ్యంలో.. కీచక లెక్చరర్లపై "ఈటీవీ" ప్రసారం చేసిన కథనానికి ఉన్నతాధికారులు స్పందించారు.

రంగంలోకి దిగిన విద్యా, రెవెన్యూశాఖల అధికారులు.. వేర్వేరుగా విచారణ నిర్వహించి కామర్స్ లెక్చరర్ నాగరాజును బుధవారం సస్పెండ్ చేశారు. తాజాగా చరిత్ర అధ్యాపకుడు ఆంజనేయులును ఉద్యోగం నుంచి తొలగిస్తూ ఉత్తర్వులిచ్చారు. ఈ ఇద్దరు లెక్చరర్లు కళాశాల విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించటమే కాకుండా, లైంగికంగా వేధించినట్లు అధికారుల విచారణలో తేలింది. విచారణలో భాగంగా అధికారులు.. విద్యార్థులు, మహిళా అధ్యాపకులతో వేర్వేరుగా మాట్లాడి కీచక లెక్చరర్ల వేధింపుల వివరాలు సేకరించారు.

అమ్మాయిలకు అధ్యాపకులు వాట్సాప్ ద్వారా పంపించిన అసభ్యకర ఛాటింగ్​లు సహా.. పలు ఆధారాలు సేకరించారు. కాగా... తలుపుల కళాశాల రికార్డు అసిస్టెంట్ రాజా సైతం మహిళా లెక్చరర్ పట్ల అమర్యాదగా ప్రవర్తించినట్లు కొత్తగా వెలుగుచూసింది. దీంతో రాజాను రాష్ట్ర కార్యాలయానికి సరండర్ చేస్తూ ఇంటర్ విద్య కడప ఆర్జేడీ విశ్వనాథ్ నాయక్ ఉత్తర్వులు ఇచ్చారు. ఈ ఆదేశాలను తక్షణమే అమలు చేయాలని కళాశాల ప్రిన్సిపల్ నీలూఫర్​ను ఆర్జేడీ ఆదేశించారు.

అసలేం జరిగిందంటే..? : సత్యసాయి జిల్లా తలుపుల జూనియర్‌ కళాశాలలో... ఇద్దరు అధ్యాపకుల అరాచకాలు, వేధింపులతో విద్యార్థినులు అల్లాడిపోతున్నారు. చదువు మానలేక, వాళ్ల వేధింపులు భరించలేక సతమతమవుతున్నారు. తల్లి లేక తండ్రి చనిపోయి సింగిల్‌ పేరెంట్ ఉన్న విద్యార్థినులనే లక్ష్యంగా చేసుకుని... అసభ్యంగా వ్యవహరిస్తున్నారు ఇద్దరు అధ్యాపకులు. అమ్మాయిల ఫోన్‌ నంబర్లు సేకరించి... దారుణంగా వేధింపులకు గురిచేస్తున్నారు. అమ్మాయిల ముందే అబ్బాయిలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారు. గోవా బీచ్‌ ఎంజాయ్‌మెంట్‌ చూపిస్తా అంటూ ఒకరు రెచ్చిపోతుంటే.. ఒళ్లో కూర్చోమంటూ మరొకరు హింసిస్తున్నారని బాధిత విద్యార్థినులు వాపోతున్నారు.

ఎవరికి చెప్పినా.. ప్రయోజనం శూన్యం: అధ్యాపకుల ఆగడాలను ఇంట్లోవాళ్ల దృష్టికి తీసుకెళ్లే ధైర్యం లేక ప్రిన్సిపల్‌కు ఫిర్యాదు చేస్తే... చర్యలు తీసుకోకుండా బాధితులపైనే ఒత్తిడి తీసుకొచ్చారు. మరో అధ్యాపకురాలికి బాధలు చెప్పుకుంటే.. విద్యార్థినుల పక్షాన నిలబడ్డారని ఆమెనూ వేధించారు. ఇక లాభం లేదనుకుని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాక.. ఆ కీచకులు మరింత రెచ్చిపోయారు. ఒప్పంద లెక్చరర్లతో జట్టు కట్టి వేధింపులు తీవ్రం చేశారు.

సమస్యను విద్యార్థి సంఘాల నాయకులకు చెబితే... తొలుత హడావుడి చేసిన వారంతా ఆ తర్వాత కీచకులతో కలసిపోయారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఎట్టకేలకు చర్యలు తీసుకున్న అధికారులు.. రెండు రోజుల క్రితం కామర్స్ అధ్యాపకుడు నాగరాజును విధుల నుంచి తొలగించారు. తాజాగా మరో అధ్యాపకుడు ఆంజనేయులును ఉద్యోగం నుంచి తొలగించారు.

ఇదీ చదవండి:పంటి బిగువున కష్టాలను భరిస్తూ.. ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తూ..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.