ఒకరికి తెలియకుండా మరొకరితో ప్రేమ, పెళ్లి పేరుతో సంబంధాలు పెట్టుకుని ఓ బాలుడు(17) ఏకంగా ముగ్గురు బాలికలను మోసం చేసిన ఘటన మహబూబాబాద్ జిల్లా గార్ల మండలంలో బుధవారం వెలుగు చూసింది. మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలుడు మొదట పక్క గ్రామానికి చెందిన బాలిక(16)ను ప్రేమ పేరుతో వంచించి శారీరక సంబంధం పెట్టుకున్నాడు. ఇది ఆమె తల్లిదండ్రులకు తెలియడంతో కొంత డబ్బు చెల్లించి తెగతెంపులు చేసుకున్నాడు.
తరువాత మరో బాలిక(14)తో శారీరక సంబంధం పెట్టుకుని, ఇంకో బాలిక(17)ను పెళ్లి చేసుకుంటానంటూ దగ్గరయ్యాడు. అనుమానంతో మూడో బాలిక బాలుడి ఇంటికే రావడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై బాలుడు, మూడో బాలిక కుటుంబసభ్యులు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో పరస్పరం ఫిర్యాదు చేసుకున్నారు. దీనిపై విచారణ చేస్తున్నామని ఎస్సై రవి తెలిపారు.
ఇదీ చదవండి: MURDER CASE: అడిగింది ఇవ్వకపోతే హత్య కేసులో ఇరికిస్తా!