Boy Murder in Nizamabad : నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఆటోనగర్‌లో దారుణం చోటుచేసుకుంది. ఏడేళ్ల బాలుడు ఫయాజ్ హత్యకు గురయ్యాడు. ఫయాజ్‌ను దారుణంగా హతమార్చిన నిందితులు రెండు చేతులు కట్టేసి కాల్వలో పడేశారు. తమ కుమారుడు గురువారం నుంచి కనిపించడం లేదని ఫయాజ్ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతడి కోసం గాలింపు మొదలు పెట్టారు.
ఇవాళ ఉదయం నిజాంసాగర్ కాల్వలో బాలుడి మృతదేహాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా వారు అక్కడికి చేరుకున్నారు. మృతదేహాన్ని పరిశీలించి ఫయాజ్‌దేనని నిర్ణరించాక అతడి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. నిన్నటి దాకా తమ కళ్ల ముందే తిరిగిన కుమారుడు నిర్జీవంగా పడి ఉండటం చూసి ఫయాజ్ తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. ఈ ఘాతుకానికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. వీలైనంత త్వరగా ఫయాజ్ మృతికి కారణమైన వారిని పట్టుకుంటామని తెలిపారు.
- ఇదీ చదవండి : ముగ్గురు యువకులు మద్యం తాగారు.. ఆపై అమ్మాయిలపై...